బంగ్లాదేశ్‌లో పడవ ప్రమాదం, 27 మంది మృతి

6 Apr, 2021 04:33 IST|Sakshi

27 మంది మృతి

ఢాకా: బంగ్లాదేశ్‌లోని షితలాఖ్య నదిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 100 మందికి పైగా ప్రయాణీకులతో వెళుతున్న పడవ ఎంఎల్‌ సబిత్‌ అల్‌ హసన్‌ మరో కార్గో వెజల్‌ను ఢీకొట్టిన ఘటనలో 27 మంది మరణించారు. ఆదివారం సాయంత్రం సమయంలో ఈ ఘటన జరిగినట్లు బంగ్లాదేశ్‌ పోలీసులు తెలిపారు.

పడవతో పాటు కొంత మంది నీటిలో మునిగిపోగా, మరి కొందరు మాత్రం ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చి ప్రాణాలు రక్షించుకున్నట్లు వెల్లడించారు. ఆదివారం 22 మృతదేహాలను వెలికితీయగా, మరో 5 మృతదేహాలను సోమవారం వెలికితీసినట్లు అధికారులు ప్రకటించారు. ఈ వెలికితీత కార్యక్రమంలో నేవీ, కోస్ట్‌ గార్డ్, ఫైర్‌ సర్వీస్, పోలీసు బలగాలు పాల్గొన్నాయి. ప్రమాదానంతరం ప్రయాణికులను రక్షించే ప్రక్రియ పూర్తయిందని బంగ్లాదేశ్‌ దేశీయ జల రవాణా ప్రాధికార సంస్థ (బిత్వా) ప్రకటించింది. 

మరిన్ని వార్తలు