ప్రయాణికుడి దెబ్బకు 200 మందికి టెన్షన్‌.. ఏం జరిగిదంటే?

26 May, 2023 14:57 IST|Sakshi

సియోల్: ఇటీవలి కాలంలో కొందరు విమాన ప్రయాణికులు అతిగా ప్రవర్తిస్తున్నారు. కొందరు విమానంలో గాల్లో ఉన్న సమయంలో డోర్‌ ఓపెన్ చేయడం, మరికొందరు ఎదుటి వారితో వాగ్వాదానికి దిగడం వంటివి తరచుగా చూస్తున్నాం. తాజాగా అలాంటి ఘటనే ఒకటి ఏషియానా విమానంలో చోటుచేసుకుంది. విమానం ఆకాశంలో ఉన్న సమయంలో ఓ ప్యాసింజర్‌ ఎమర్జెన్సీ డోర్‌ను ఓపెన్‌ చేశాడు. దీంతో, కొందరు ప్రయాణికులు అస్వస్థతకు గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

వివరాల ప్రకారం.. ద‌క్షిణ కొరియాలో ఏషియానా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమాన డోర్‌ను ఓ ప్యాసింజెర్ తెరిచాడు. ఏ321 విమానం గాలిలో ఉన్న‌ప్పుడు ఓ వ్య‌క్తి ఆ విమాన్ డోర్‌ను తీశాడు. ద‌క్షిణ దీవి జేజూ నుంచి డేగూ వెళ్తున్న విమానంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఆ స‌మ‌యంలో విమానంలో దాదాపు 200 మంది ప్ర‌యాణికులు ఉన్నారు. దీంతో, అప్రమత్తమైన పైలట్‌ ఆ విమానాన్ని డేగు విమానాశ్ర‌యంలో దించారు. కాగా, సదరు ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్‌ను ఓపెన్‌ చేస్తున్న సమయంలో ప్రయాణికులు అత‌న్ని అడ్డుకునే ప్ర‌య‌త్నం చేసినా ఆ డోర్ ఓపెన్ అయ్యింది.

ఇక, విమానం గాలిలో ఉన్న సమయంలో డోర్‌ ఓపెన్‌ కావడంతో అందులో ఉన​ ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అయితే, సదరు వ్యక్తి డోర్‌ ఎందుకు ఓపెన్‌ చేశాడన్నది తెలియరాలేదు. మరోవైపు.. ఉల్స‌న్‌లో జ‌రుగుతున్న ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు చాలా మంది అథ్లెట్లు ఆ విమానంలో ప్ర‌యాణిస్తున్నారు. శ్వాస కోస ఇబ్బందులు త‌లెత్తిన్న ప్రయాణికుల‌ను హాస్పిట‌ల్‌కు త‌ర‌లించిన‌ట్లు ర‌వాణాశాఖ తెలిపింది. కాగా, విమానంలో డేగు ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ అయిన వెంటనే డోర్ ఓపెన్ చేసిన వ్య‌క్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇది కూడా చదవండి: బ్రిటన్ ప్రధాని నివాసంపైకి కారుతో దాడికి యత్నం?.. రిషి సునాక్‌ సేఫ్‌!

మరిన్ని వార్తలు