కోసి కుట్లేయడమే కదా అనుకున్నాడు.. మహిళ మృతి

8 Jun, 2021 17:01 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

మహిళకు సర్జరీ చేసిన మాజీ సెక్యూరిటీ గార్డ్‌

రెండు వారాల్లోనే మహిళ మృతి

పాక్‌లో చోటు చేసుకున్న సంఘటన

ఇస్లామాబాద్‌: అప్పుడప్పుడు ఆర్‌ఎంపీలు, కాంపౌండర్‌లు ఆస్పత్రికి వచ్చిన పేషెంట్లకు చికిత్స చేయడమే కాక ఏకంగా ఆపరేషన్‌లు కూడా చేస్తూ.. బాధితుల ప్రాణాలతో ఆడుకుంటున్న సంఘటనలను అనేకం చూశాం. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన మరోకటి వెలుగులోకి వచ్చింది. మాజీ సెక్యూరిటీ గార్డు ఒకరు తానే వైద్యుడినని చెప్పి ఓ వృద్ధురాలికి ఆపరేషన్‌ చేశాడు. దురదృష్టం కొద్ది సర్జరీ వికటించి సదరు మహిళ చనిపోయింది.

ఆ వివరాలు.. పాకిస్తాన్‌ లాహోర్‌కు చెందిన షమీమా బేగం(80) వెన్నులో ఏదో సమస్య తలెత్తింది. దాంతో కుటుంబ సభ్యులు ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో షమీమా కుటుంబ సభ్యులకు మాజీ సెక్యూరిటీ గార్డ్‌ మహ్మాద్‌ వహీద్‌ బట్‌ తారసడ్డాడు. తాను ఇదే ఆస్పత్రిలో పని చేస్తున్నాని నమ్మ బలికి వారి సమస్య ఏంటో తెలుసుకున్నాడు. ఆ తర్వాత షమీమాకు వెంటనే ఆపరేషన్‌ చేయకపోతే ప్రమాదం అని చెప్పాడు. తనకు కొంత డబ్బు ఇస్తే.. వెంటనే సర్జరీ చేస్తానని వారికి తెలిపాడు.

దాంతో షమీమా కుటుంబ సభ్యులు అతడికి కొంత డబ్బు ఇచ్చారు. బట్‌ మరో టెక్నిషియన్‌ను తీసుకెళ్లి షమీమాకు ఆపరేషన్‌ చేశాడు. రెండు మూడు రోజుల తర్వాత డిశ్చార్జ్‌ చేసి పంపించాడు. ఆ తర్వాత బట్‌ రెండు సార్లు షమీమా ఇంటికి వెళ్లి డ్రెస్సింగ్‌ చేశాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు షమీమా ఆరోగ్యం  మరింత క్షీణించసాగింది. ఆపరేషన్‌ చేసిన దగ్గర తీవ్ర రక్తస్రావం కాసాగింది.

దాంతో షమీమాకు గతంలో ఆపరేషన్‌ చేసిన ఆస్పత్రికే తీసుకెళ్లి పరిస్థితి వివరించగా.. ఆ ఆస్పత్రిలో బట్‌ అనే డాక్టర్‌ ఎవరు లేరని తెలిసింది. అప్పటికే షమీమా మృతి చెందింది. ఇక బట్‌పై గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చినట్లు అక్కడి సిబ్బంది తెలిపారు. అతడిని విధుల నుంచి తొలగించినట్లు ఆస్పత్రి యాజమాన్యం ప్రకటించింది. 

చదవండి: వైరల్‌: ఈ లంచ్‌ బాక్స్‌ చూస్తే కన్నీళ్లు ఆగవు

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు