ఆర్థికశాస్త్రంలో నోబెల్ విజేతలు వీరే

12 Oct, 2020 17:18 IST|Sakshi

ఆర్థికశాస్త్రంలో పాల్‌ ఆర్‌ మిల్‌గ్రామ్‌,  రాబర్ట్‌ విల్సన్‌కు సంయుక్తంగా నోబెల్

సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక శాస్త్రంలో  ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి ఆర్థిక శాస్త్రవేత్తలు పాల్ ఆర్ మిల్‌గ్రామ్‌, రాబర్ట్ బి విల్సన్‌లను వరించింది. వేలం సిద్ధాంతాన్ని అభివృద్ధి చేయడం, కొత్త వేలం విధానాలను కనుగొన్నందుకు గానూ వీరద్దరికి ఈ ఏడాది ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. వేలం ప్రతిచోటా ఉంది . అది దైనందిన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. పాల్ మిల్‌గ్రామ్‌, రాబర్ట్ విల్సన్ వేలం సిద్ధాంతాన్ని మెరుగుపరిచారు కొత్త వేలం ఆకృతులను కనుగొన్నారు.  ప్రపంచవ్యాప్తంగా అమ్మకందారులకు, కొనుగోలుదారులకు, పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం చేకూరుస్తున్నారని అకాడమీ వ్యాఖ్యానించింది. ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు 10 మిలియన్ క్రోనా (1.1 మిలియన్ డాలర్లు) నగదు బహుమతి, బంగారు పతకం లభిస్తుంది. (అప్పటికి 3వ అతిపెద్ద ఆర్థిక దేశంగా భారత్)

ప్రపంచవ్యాప్తంగా అమ్మకపుదారులకు, వినియోగదారులకు, టాక్స్ పేయర్స్‌కు లబ్ది చేకూర్చేలా వేలం సిద్దంతాన్ని సరళీకరించడమే కాకుండా, కొత్త వేలం విధానాలను ఆవిష్కరించిన పాల్ ఆర్ మిల్‌గ్రామ్‌, రాబర్ట్ బి విల్సన్‌కు ఆర్థిక శాస్త్రంలో నోబెల్ అందజేస్తున్నామని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సెక్రటరీ జనరల్ గోరన్ హాన్సన్ ప్రకటించారు. రాబర్ట్ విల్సన్.. కామన్ వాల్యూతో వస్తువులను వేలం విధానాన్ని అభివృద్ది చేశారు. మరోవైపు పాల్ మిల్‌గ్రామ్‌, వేలం సిద్ధాంతాన్ని మరింత సరళీకరించారు. కేవలం కామన్ వాల్యూ మాత్రమే కాకుండా ఒక బిడ్డర్ నుంచి మరో బిడ్డర్ మారేలా ప్రైవేటు వాల్య్సూను అనుమతించారు. కాగా ఆల్ ఫ్రెడ్ నోబెల్ జ్ఞాపకార్థం 1969 నుంచి ఆర్థికశాస్త్రంలో నోబెల్ పురస్కారం ఇస్తున్నారు. గత ఏడాది ఆర్థిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి ప్రదానం చేయగా వీరిలో భారతీయ అమెరికన్ అభిజిత్ బెనర్జీ  ఉన్న సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు