వైరలైన అమూల్‌ ‘హమారీ పావ్‌ టీ హోరహీ హై’

19 Feb, 2021 12:46 IST|Sakshi

ముంబై: హమారీ పావ్రీ హోరహీ హై (మా పార్టీ అవుతోంది) మాషప్‌ నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. యశ్‌రాజ్‌ ముఖాటే రూపొందించిన ఈ మాషప్‌ పాక్‌ యువ డ్యాన్సర్‌ డాననీర్‌ ఎంట్రీతో మరో లెవల్‌కి వెళ్లింది. తనదైన స్టయిల్‌లో ఆమె మాషప్‌లో.. యే హమారీ కార్‌ హై, హే హమ్‌ హై, హమారీ పావ్‌రీ హోరహీ హై (ఇది మా కారు, ఇది మేము, మా పార్టీ అవుతోంది) అంటూ వీడియో షేర్‌ చేయడంతో అది వైరల్‌ అయింది. లక్షల వ్యూస్‌ సాధించింది. దాంతో ‘పావ్‌రీ హోరహి హై ’ హ్యాష్‌ ట్యాగ్‌ ట్రెండింగ్‌లో నిలిచింది. 

ఇక ట్రెండింగ్‌లో ఉన్న హ్యాష్‌ ట్యాగ్‌తో ఇప్పటికే జొమాటో, స్విగ్గీ, మెక్‌ డొనాల్డ్స్‌, నెట్‌ఫ్లిక్స్‌ సంస్థలు పోస్టులు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా వీటి సరసన అమూల్‌ కూడా చేరింది. ‘హమారీ పావ్‌ టీ హోరహీ హై’(బ్రెడ్‌ తో టీ పార్టీ అవుతోంది) అనే మీమ్‌ను జత చేసి అమూల్‌ ‘పావ్‌రీ టీ హోరహి హై’ హ్యాష్‌ ట్యాగ్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ఇప్పుడు అమూల్‌ పోస్టు కూడా వైరల్‌గా మారింది. మహరాష్ట్రలో పావ్‌ (బ్రెడ్‌)కు ప్రత్యేక స్థానం ఉన్న విషయం తెలిసిందే.

చదవండి: ‘హమారీ పావ్‌రీ’ నయా ట్రెండ్‌ వైరల్‌

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు