Peng Shuai Missing: టెన్నిస్‌ ప్లేయర్ ఆచూకిని సరైన ఆధారాలతో సహా తెల్పండి

21 Nov, 2021 10:56 IST|Sakshi

లండన్‌: బ్రిటన్‌ చైనా టెన్నిస్ స్టార్ పెంగ్ షువాయ్ భద్రత దృష్ట్యా ఆమె ఆచూకికి సంబంధించి ధృవీకరించ దగిన ఆధారాలను అందించాలని చైనాను కోరింది. ఆమె అదృశ్యం కావడం పట్ల తాము ఆందోళన చెందుతున్నామని దయచేసి సాధ్యమైనంత వరకు సరైన ఆధారాలను త్వరితగతిన అందించాలంలూ బీజింగ్‌లోని యూకే విదేశీ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. అంతేకాదు తమకు ఏం జరుగుతోందని భయపడకుండా ప్రతిఒక్కరు మాట్లాడటానికి ముందుకు రావలంటూ విజ్ఞప్తి చేసింది.

(చదవండి: అమెజాన్‌ డైరెక్టర్‌ల పై నార్కోటిక్ డ్రగ్స్ కేసు)

అంతేకాదు ప్రపంచంలో ఎక్కడైనా సరే లైంగిక వేధింపులకు సంబంధించిన అన్ని నివేదికలు సత్వరమే దర్యాప్తు చేయాలంటూ బ్రిటన్‌ వక్కాణించింది. పైగా యూనైటెడ్‌ స్టేట్స్‌, యూఎన్‌ టెన్నిస్‌ స్టార్‌ ఆచూకి కోసం పిలుపినిచ్చే నేపథ్యంలో చైనా టెన్నిస్‌ స్టార్‌ పెంగ్‌ చక్కగా నవ్వుతూ ఉన్న ఫోటోలను సోషల్‌ మీడియా చైనా పోస్ట్‌ చేసింది. దీంతోబ్రిటన్‌ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలో రెండుసార్లు గ్రాండ్ స్లామ్ డబుల్స్ ఛాంపియన్‌ని గెలుచుకున్న 35 ఏళ్ల పెంగ్ షువాయ్ ఆచూకీ గురించి అంతర్జాతీయ ఒత్తిడి పెరుగుతోంది. పైగా పెంగ్‌ ఈ నెల ప్రారంభంలో ఒక మాజీ వైస్ ప్రీమియర్ తనను సెక్స్ చేయమని బలవంతం చేశాడని ఆరోపించిన నేపథ్యంలోనే ఆమె ఆచూకి కానరాకపోవడం గమనార్హం.

(చదవండి: 11 ఏళ్ల పాకిస్తాన్‌ మైనర్‌ బాలుడి పై అత్యాచారం, హత్య)

మరిన్ని వార్తలు