పెంగ్విన్‌ ఆర్ట్‌

11 Jul, 2022 03:58 IST|Sakshi

పెంగ్విన్‌ పెయింటింగ్స్‌ గీసిన చిత్రకారులెందరినో చూసుంటారు. కానీ పెయింటింగ్‌ వేసే పెంగ్విన్‌ ఒకటుంది. అద్భుతమైన చిత్రాలను గీయడమే కాదు... వాటితో ఓ ప్రదర్శన కూడా ఏర్పాటయ్యింది. నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం. యూకేలోని హెల్‌స్టన్‌ సమీపంలో ఉన్న ‘గ్వీక్‌ కార్నిష్‌ సీల్‌ సంరక్షణ కేంద్రం’లో స్క్విడ్జ్‌ అనే పెంగ్విన్‌ ఉంది. అది తన పాదముద్రలతో అద్భుతమైన పెయింటింగ్స్‌ గీసింది.

ఆ చిత్రాలను పెన్‌జేన్స్‌లో జాతీయ, అంతర్జాతీయంగా ప్రముఖ చిత్రకారుల ప్రదర్శనలు జరిగే... ‘దఎక్సే్ఛంజ్‌’ ఆర్ట్‌ గ్యాలరీలో ప్రదర్శించారు. ఇలా పెంగ్విన్‌ గీసిన చిత్రాలతో యూకేలో ఎగ్జిబిషన్‌ జరగడం మొదటిసారి. ఆ పెయింటింగ్స్‌ను ‘ఫండ్‌ అవర్‌ ఫ్యూచర్‌’ పేరుతో https://uk.givergy. com/sealsanctuary వేలంలో కూడా పెట్టారు. వేలంలో పాల్గొనలేనివాళ్లు... ఇదే వెబ్‌సైట్‌లో టికెట్‌ కొంటే ప్రతి ఇద్దరిలో ఒకరు స్క్విడ్జ్‌ గీసిన చిన్న చిన్న ఆర్ట్‌ పీస్‌లను గెలుచుకోవచ్చు. ఇలా వచ్చిన డబ్బును సంరక్షణ కేంద్రం అభివృద్ధి, జంతువుల సంక్షేమం కోసం ఉపయోగించనున్నారు.   

మరిన్ని వార్తలు