వైరల్‌: అగ్ని పర్వతం పక్కనే వాలీబాల్‌ ఆట

30 Mar, 2021 13:03 IST|Sakshi

రేక్సావిక్: ఐస్‌ల్యాండ్‌ రాజధాని రేక్సావిక్‌కు 40 కిలో మీటర్ల దూరంలో ఉన్న కేక్సానెస్‌ అగ్నిపర్వతం ఈ నెల 28న బద్ధలైంది. దీంతో పర్వతంలో నుంచి పెద్ద ఎత్తున లావా బయటకు వస్తోంది. అయితే ఆ లావా వేడి తీవ్రత తక్కువగానే ఉండటంతో పర్యాటకులు కాస్త దాని దగ్గరగా వెళ్లి పరిశీలించే అవకాశం కలుగుతోంది. ఆదివారం చాలా మంది హైకర్లు, సందర్శకులు అక్కడికెళ్లి దాన్ని పరిశీలించారు. పర్యాటకలు అగ్ని పర్వతం వద్ద సెల్పీలు దిగుతున్నారు. తాజాగా అగ్ని పర్వతం వద్ద కొంత మంది యువకులు సరదగా వాలీబాల్‌ ఆడిన వీడియో​ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

రూట్ ఐనార్స్‌డోట్టిర్ అనే మహిళ తన ట్విటర్‌ ఖాతాలో వాలీబాల్‌ ఆడుతున్న వీడియోను పోస్ట్‌ చేశారు. ‘అగ్నిపర్వతం వద్ద యువకులు సరదగా వాలీబాల్‌ ఆడుతున్నారు’ అని ఆమె కామెంట్‌ జతచేశారు. ఇ‍ప్పటి వరకు ఈ వీడియోను పదిలక్షల మంది వీక్షించారు. ఆమె మరో వీడియోను షేర్‌ చేసి.. ‘ ఉదయం ఆగ్ని పర్వతం వద్ద కాఫీ తాగడం చాలా సంతోషంగా ఉంది’ అని కామెంట్‌ చేశారు. ఈ వీక్షించిన నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ‘చాలా అద్భుతం’, ‘అక్కడ  ఆటలు ఆడటాన్ని నిషేధిస్తారు.. జాగ్రత్త’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు