ఆ వెయ్యిమంది కుక్కల్లా ఎందుకు మొరిగారు?

28 Sep, 2023 13:42 IST|Sakshi

మీరు ఎక్కడికైనా వెళ్లినప్పుడు వందలాది మంది ఒకే చోట గుమిగూడి మిమ్మల్ని చూసి కుక్కలా మొరిగితే మీకు ఏమనిపిస్తుంది? ఎవరైనా సరే ఇటువంటి అనుభవం ఎదురైతే ఆశ్చర్యపోతారు. అవహేళన చేస్తున్నారేమోనని అనుకుంటారు. 

ఇటువంటి ఉదంతం బెర్లిన్‌లోని పోట్స్‌డామర్ ప్లాట్జ్ రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకుంది. ఈ  ఉదంతానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రైల్వే స్టేషన్ వెలుపల సుమారు వెయ్యి మంది జనం ఒకచోట గుమిగూడారు. అయితే ఉన్నట్టుండి కుక్కలా మొరగడం మొదలుపెట్టారు. 

రైల్వేస్టేషన్‌లో ఉన్న కొందరు ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం వారు సామూహికంగా మొరుగుతూ అటువైపు వచ్చిపోయే వారితో మాట్లాడుతున్నారు. ‘డైలీ మెయిల్’ తెలిపిన వివరాల ప్రకారం రైల్వే స్టేషన్ వెలుపల సామూహికంగా కుక్కల్లా మొగిన వ్యక్తులను ట్రాన్స్-స్పెసీస్ అని అంటారు. వీరు తమను తాము  కుక్కలుగా భావిస్తుంటామని తెలిపారు. 
ఇది కూడా చదవండి: ఇంటిపై పాక్‌ జెండా ఎగురవేసిన తండ్రీకుమారులు అరెస్ట్‌
 

మరిన్ని వార్తలు