అయ్యో బిడ్డా .. శాశ్వతంగా నవ్వు ముఖమే !.. ప్రపంచంలో ఇలాంటి కేసులు 14!

27 May, 2022 13:40 IST|Sakshi

పిల్లలు అన్నాక.. పుట్టిన సమయంలోనైనా ఏడ్వాలి కదా!. కానీ, ఇక్కడో పసికందు నవ్వుతూనే పుట్టింది. ఎందుకో తెలుసా? ఆ బిడ్డ ముఖంలో అలాంటి లోపం ఏర్పడింది. అదీ తల్లిదండ్రుల ప్రమేయం లేకుండానే ఈ స్థితి ఏర్పడింది ఆ పసిపాపకు!. 

బైలేటరల్‌ మాక్రోస్టోమియా.. అరుదైన పరిస్థితి ఇది. పుట్టుకతో వచ్చే క్రమరాహిత్యం. బిడ్డ కడుపులో ఉన్నప్పుడు ఏడో వారంలో.. కణజాలాల వల్ల ఈ స్థితి ఏర్పడుతుంది. ప్రపంచంలో ఇప్పటికి ఇలాంటి పరిస్థితితో కేవలం 14 కేసులు మాత్రమే నమోదు అయ్యాయని ఉందని గణాంకాలు చెప్తున్నాయి. అందులో 14వ కేసు.. ఎయిలా సమ్మర్‌ ముచా. 

ఆస్ట్రేలియాకు చెందిన క్రిస్టియానా వెర్చెర్(21)‌, బ్లేజియా ముచా(20) సంతానం ఈ ఎయిలా. డిసెంబర్‌ 2021లో జన్మించింది ఈ చిన్నారి. అయితే పుట్టినప్పుడు ఆ బిడ్డ ఏడ్వలేదు. పైగా పెదాల దగ్గర అసాధారణ స్థితి నెలకొనడంతో ఆ తల్లిదండ్రులు కంగారుపడిపోయారు. 

డాక్టర్లు పరిశీలించి.. అది బైలెటరల్‌ మాక్రోస్టోమియాగా నిర్ధారించారు. తద్వారా పెదాలు సాగిపోయినట్లు ఉంటుంది. అందుకే ఆ చిన్నారి పుట్టినప్పుడు ఏడ్వలేకుండా ఉంది. ఈ పరిస్థితి గురించి ఆరాతీయగా.. తల్లి గర్భంలోనే బిడ్డకు ఏడో వారంలో పిండ దశ నుంచే ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందని తేలింది. ప్రపంచంలో ఇలాంటి కేసులు ఇప్పటిదాకా 14 మాత్రమే ఉన్నాయని తేలింది. సర్జరీతో బిడ్డ స్థితి మెరుగుపడే అవకాశం ఉన్నా.. పెద్దయ్యాక మళ్లీ ఆ స్థితి ఏర్పడొచ్చనే వైద్యులు చెబుతున్నారు. 

ప్రస్తుతం ఈ జంట సోషల్‌ మీడియా ద్వారా బిడ్డ స్థితిని.. ఇలాంటి పరిస్థితుల్లో తాము ఎలా ఎదుర్కొంటున్నామో తెలియజేసేందుకు పోస్టులు చేస్తోంది. అయితే బిడ్డ స్థితి తెలిసి కూడా కొందరు దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారు. దీనిపై ఆ పసికందు తల్లి స్పందిస్తూ..  మనిషికి ఏడుపు ఒక శాపం.. నా బిడ్డకు నవ్వు ఒక వరం.. నవ్వే వాళ్లను నవ్వనివ్వండి అంటోంది. 

మరిన్ని వార్తలు