మరణశయ్యపై పాక్‌ మాజీ ప్రధాని ‘ముషారఫ్‌’.. ఆందోళనలో కుటుంబ సభ్యులు

10 Jun, 2022 21:14 IST|Sakshi

పాకిస్తాన్‌ మాజీ ప్రధాని ప‍ర్వేజ్‌ ముషారఫ్‌(78) ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించినట్టు ముషారఫ్‌ కుటుంబ సభ్యులు వెల్లడించారు. వైద్యులు కూడా ఆయన కోలుకోవడం సాధ్యం కాదని తెలిపినట్టు వెల్లడించారు.  ముషారఫ్‌.. దుబాయ్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.

ఇక, బ్రిటిష్‌ పాలనా కాలంలో (11 ఆగష్టు 1943) ముషారఫ్‌ ఢిల్లీలో జన్మించగా.. అనంతరం కరాచీ, ఇస్తాంబుల్‌లో పెరిగారు. 2001 నుండి 2008 వరకు పాకిస్తాన్‌ అధ్యక్షుడిగా కొనసాగారు. కాగా, ముషారఫ్ 1961లో పాకిస్తాన్ మిలిటరీ అకాడమీలో చేరి.. 1964లో ఆఫ్ఘన్ అంతర్యుద్ధంలో కీలక పాత్ర పోషించారు. 1990వ దశకంలో, ముషారఫ్ మేజర్ జనరల్‌గా పదోన్నతి పొందారు. 1998లో ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ చేత ఫోర్-స్టార్ జనరల్‌గా పదోన్నతి పొందడంతో ముషారఫ్ జాతీయ స్థాయికి ఎదిగారు. 

1999లో భారత్‌, పాకిస్తాన్‌ మధ్య చోటుచేసుకున్న కార్గిల్‌ యుద్ధంలో పాక్‌ సైన‍్యానికి ముషారఫ్‌ నాయకత్వం వహించారు. 2007లో పదవీ విరమణ చేసే వరకు ముషారఫ్‌ ఆర్మీ చీఫ్‌గా కొనసాగాడు. 2007లో ప్రజా ప్రభుత్వాన్ని రద్దు చేసినందుకు గానూ పాక్‌ సుప్రీంకోర్టు 2013లో ముషారఫ్‌కు మరణ శిక్ష విధించింది. కాగా, ఆరోగ్య పరిస్థితి బాగా లేదని ముషారఫ్ 2016లో పాకిస్తాన్ నుండి దుబాయ్‌కు వెళ్లిపోయారు. 

ఇది కూడా చదవండి: రష్యా ఊగిసలాట.. పుతిన్‌ డబుల్‌ గేమ్‌? వాళ్లను నిండా ముంచడమే లక్ష్యంగా..!

మరిన్ని వార్తలు