లండ‌న్: క‌రోనా బారిన‌ప‌డ్డ పెంపుడు పిల్లి

28 Jul, 2020 16:47 IST|Sakshi

లండ‌న్: బ్రిటన్‌లో క‌రోనా బారిన ప‌డిన మొట్ట‌మొద‌టి పెంపుడు జంతువుగా పిల్లిని జూలై 27న యూకే అధికారులు గుర్తించారు. శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బంది ప‌డుతున్న‌ట్లు గుర్తించిన య‌జ‌మానులు ఆసుప‌త్రికి త‌ర‌లించ‌గా క‌రోనా పాజిటివ్ ఉన్న‌ట్లు తేలింది. ఇంత‌కు ముందు పిల్లి య‌జ‌మానులు క‌రోనా బారిన ప‌డ్డారు. దీంతో వారి నుంచే పిల్లికి క‌రోనా సోకి ఉండొచ్చ‌ని ప్రాథ‌మికంగా అంచ‌నా వేశారు. జంతువులు ప్రాణాంత‌క వైర‌స్‌ల‌ను వ్యాప్తి చేస్తాయ‌న్న ఆధారాలు ఇప్ప‌టివ‌ర‌కు లేవ‌ని వెట‌ర్న‌రీ చీఫ్ క్రిస్టిన్ మిడిల్మిస్ అన్నారు. ఈ ఘ‌ట‌న‌ను చాలా అరుదైన‌దంటూ అభివ‌ర్ణించారు. లండ‌న్‌లో ఈ త‌ర‌హా క‌రోనా కేసు గుర్తించ‌డం ఇదే మొద‌టిసారి. అమెరికాలోని న్యూయార్క్‌లో జంతువుల‌కు క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయిన సంగ‌తి తెలిసిందే. (స్మెల్‌ టెస్ట్‌ ఫెయిల్‌.. మాల్స్‌లోకి నో ఎంట్రీ: మేయర్‌)

గ‌బ్బిలాల నుంచి క‌రోనా వైర‌స్ మ‌నుషుల‌కు వ్యాప్తి చెంది ఉండొచ్చ‌ని మొదట్లో అనుమానాలు వెల్ల‌డైనా ఇప్ప‌టి వ‌ర‌కు దానికి సంబంధించి ఎలాంటి రుజువు కాలేదు. అంతేకాకుండా కుక్క, పిల్లులు కూడా క‌రోనా వాహ‌కాలుగా మారుతున్న‌ట్లు కొంద‌రు ఆరోపించారు. అయితే ఎలాంటి ల‌క్ష‌ణాలు లేక‌పోయినా ఒక‌వేళ ఏదైనా పిల్లి క‌రోనా బారిన ప‌డితే మిగ‌తా పిల్లులకు కూడా వ్యాధి సంక్ర‌మించే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తాజాగా కొంద‌రు శాస్త్రవేత్తలు వెల్ల‌డించారు. దీనికి సంబంధించి మ‌రింత లోతుగా అధ్య‌య‌నం చేయాల్సిందిగా యూనివ‌ర్సిటీ ఆఫ్ విస్కాన్సిస్ స్కూల్ ఆఫ్ వెట‌ర్నటీ విభాగం పేర్కొంది. (పంటి నొప్పిని పట్టించుకోండి లేదంటే..)

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు