విచిత్ర ఘటన: యజమానినే కాల్చి చంపిన కుక్క

25 Jan, 2023 16:06 IST|Sakshi

ఒక్కోసారి మన పెంపుడు కుక్కలే అనుకోని విధంగా మనకు హాని తలపెడతాయి. విధి రాత లేక వైపరిత్యమో మరి ఏదైనా గానీ ఒక్కోసారి ఇలాంటి షాకింగ్‌ ఘటనలు మాత్రం కాస్త భయాన్ని కలిగిస్తాయి. ఇక్కడొక వ్యక్తి కూడా తన పెండపుడు కుక్కతో సరదాగా వేటకు వెళ్లాలని ప్లాన్‌ చేసుకున్నాడు. చక్కగా పెంపుడు కుక్క, డ్రైవర్‌ని తీసుకుని కారులో జాలీగా వెళ్తున్నాడు. అంతే అనుహ్యంగా కుక్క కాల్పులు జరపడంతో ఒక్కసారిగా కుప్పకూలి చనిపోయాడు. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకెళ్తే..ఒక పికప్‌ ట్రక్కులో 30 ఏళ్ల వ్యక్తి తన పెంపుడు కుక్కను తీసుకుని వేటకు వెళ్లాడు. వారితోపాటు డ్రైవర్‌ కూడా ఉన్నాడు. ఐతే కుక్క తుపాకీ ఉన్న వెనుక సీటు వద్దకు వెళ్లి బయటకు తీసింది. ప్రమాదవశాత్తు అది పేలడంతో బుల్లెట్‌ సరాసరి ఆ వ్యక్తి శరీరంలోకి దూసుకుపోవడంతో క్షణాల వ్యవధిలో అతను కుప్పకూలి చనిపోయాడు. ఈ ఘటనలో ప్యాసింజర్‌ సీటులో కూర్చొన్న ఆ వ్యక్తి మరణించగా, డ్రైవర్‌ క్షేమంగానే ఉన్నాడు.  

ఐతే యూఎస్‌ పోలీసులు రైఫిల్‌పై కుక్క అడుగు పడడంతో పేలినట్లు తెలిపారు. చనిపోయిన వ్యక్తి కుక్క యజమానినే కాదా అనే విషయంపై కూడా దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. భారత కాలమానం ప్రకారం ఉదయం 9.40 నిమిషాలకు చనిపోయినట్లు వెల్లడించారు. దీన్ని వేట సంబంధిత ప్రమాదంగా కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. వాస్తవానికి యూఎస్‌లో ప్రమాదవశాత్తు కాల్పులు సర్వసాధారణమే గానీ ఇది మాత్రం కాస్త విచిత్రమైన ఘటనే.

(చదవండి: ఫ్యామిలీ తర్వాతే ఏదైనా! అంటూ సడెన్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చిన కూతురు)

మరిన్ని వార్తలు