రష్యా అధ్యక్షుడికి మరో ఊహించని షాక్‌...!

21 Mar, 2022 21:32 IST|Sakshi

Demanding Switzerland Hosts Putin lover Expel: ఉక్రెయిన్‌పై రష్యా గత 26 రోజులుగా భయంకరంగా దాడులు చేస్తునే ఉంది. ఆంక్షలను సైతం పక్కనపెట్టి తనదైన యుద్ధ వ్యూహంతో సాగిపోయింది. అంతర్జాతీయ న్యాయస్థాన ఆదేశాలను దిక్కరించి మరీ ఉక్రెయిన్‌పై భీకరంగా విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలన్ని మూకుమ్మడిగా రష్యా ఆట కట్టించే దిశగా రంగం కూడా సిద్ధం చేసింది.

మరోవైపు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌.. గర్ల్‌ఫ్రెండ్‌ని లక్ష్యంగా చేసుకుని మరీ ఆన్‌లైన్‌ వేదికగా పుతిన్‌ అంటే గిట్టని కొంతమంది పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ మేరకు change.org అనే వెబ్‌సైట్‌లో ఆమెను బహిష్కరించాలంటూ పిటిషన్‌ వచ్చింది. అంతేకాదు పిటిషన్‌లో.. 38ఏళ్ల అలీనా కబయేవా మాజీ జిమ్నాస్ట్‌ అని స్విట్టర్లాండ్‌లో తన ముగ్గురు పిల్లలతో విలాసవంతమైన విల్లాలో ఉ‍న్నారని ఆరోపణలు చేయమే కాక ఆమెను బహిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

ఇప్పుడు మనం పుతిన్‌ భాగస్వామిని ఆయనతో కలిపే సమయం ఆసన్నమైందని ఘాటు వ్యాఖ్యలు చేసింది. పైగా పుతిన్‌ ఆమె రహస్య ‍ప్రేయసిని అధికారికంగా గుర్తింపు ఇవ్వలేదని తెలిపింది. ఈ యుద్ధ సమయంలో పుతిన్‌ రహస్య ప్రేయసికి స్విట్జర్లాండ్‌ ఆతిధ్యం ఇస్తూనే ఉందని పిటిషన్‌లో పేర్కొంది.  పైగా ఆ పిటిషన్‌పై దాదాపు 50 వేలకు పైగా సంతకాలు చేశారు. అయితే ఉక్రెయిన్‌తో రష్యా సాగిస్తున్న భీకరమైన యుద్ధం నేపథ్యంలోనే ఈ పిటిషిన్‌ రావడం గమనార్హం. 

రష్యన్ ఫెడరేషన్‌పై విధించిన ఆంక్షల పరిణామాల నేపథ్యంలో రష్యన్ అనుకూల రాజకీయ మీడియా డైరెక్టర్‌, మాజీ అథ్లెట్ అలీనా కబయేవాని మీ దేశంలో దాచిపెడుతున్నారని ప్రజలు ఇప్పుడే తెలుసుకుంటున్నారని కూడా పిటిషన్‌లో వెల్లడించింది. అంతేకాదు ఆధునిక చరిత్రలో తొలిసారిగా స్విట్జర్లాండ్ తన తటస్థతను ఉల్లంఘించిందని పిటిషన్‌లో ఆరోపణలు గుప్పించింది.

(చదవండి: 2 వేల మంది చిన్నారులను కిడ్నాప్‌ చేసిన రష్యా: ఉక్రెయిన్‌ విదేశాంగ శాఖ)

మరిన్ని వార్తలు