ఫైజర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సంచలన వ్యాఖ్యలు

28 Nov, 2020 17:03 IST|Sakshi

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ని కట్టడి చేయగల వ్యాక్సిన్‌ కోసం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు తీవ్రంగా కృషి చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ తయారీదారు ఫైజర్‌–బయోఎన్‌టెక్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, చీఫ్‌ సైంటిస్ట్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనాను అంతం చేయడానికి ఎలాంటి వ్యాక్సిన్‌లు అవసరం లేదన్నారు. లైఫ్‌సీటెన్యూస్‌.కమ్‌ ప్రకారం డాక్టర్ మైఖేల్ యెడాన్ మాట్లాడుతూ.. ‘మహమ్మారిని నిర్మూలించడానికి ఎలాంటి వ్యాక్సిన్ అవసరం లేదు. వ్యాక్సిన్‌ల గురించి కొన్ని వార్తలు చదివితే నాకు చాలా చిరాగ్గా అనిపిస్తుంది. వ్యాధి బారిన పడనివారికి వ్యాక్సిన్‌ ఇవ్వాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మనుషలు మీద ప్రయోగాలు జరపని వ్యాక్సిన్‌లని మిలయన్ల మంది ఆరోగ్యవంతులైన ప్రజలకు ఇవ్వాలని భావించడం కూడా సరికాదు’ అన్నారు యెడాన్‌. యూకే ప్రభుత్వ రంగ సంస్థ సేజ్‌(సైంటిఫిక్‌ అడ్వైజర్‌ గ్రూప్‌ ఫర్‌ ఎమర్జెన్సీస్‌)పై విమర్శలో భాగంగా యెడాన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. సేజ్‌ అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వానికి సలహాలు ఇస్తుంది. (చదవండి: వ్యాక్సిన్‌లకు అత్యవసర అనుమతి!)

లైఫ్‌సీటెన్యూస్.కామ్ ప్రకారం, కోవిడ్ -19 వైరస్‌కు ప్రతిస్పందనగా, ఇటీవల అమలు చేసిన నిబంధనలతో సహా యూకేలో పబ్లిక్ లాక్‌డౌన్ విధానాలను నిర్ణయించడంలో సేజ్‌ ప్రధాన పాత్ర పోషించింది. ఇక యెడాన్‌ సేజ్‌ తప్పిదాలను ఎత్తి చూపారు. దాని తీర్మానాల వల్ల  గత ఏడు నెలలుగా ప్రజలు తీవ్రంగా బాధపడ్డారని ఆయన మండి పడ్డారు. ఏడుగురు మాత్రమే ఇన్‌ఫెక్ట్‌ అయ్యారు.. ప్రతి ఒక్కరు వైరస్‌ బారిన పడ్డారంటూ సేజ్‌ చేసిన వ్యాఖ్యలను యెడాన్‌ ఖండించారు. ఇది అస్సలు నమ్మలేని విషయం. శ్వాసకోశ వైరస్‌లకు వ్యతిరేకంగా రోగనిరోధక రంగంలోని ముందుమాటను విస్మరించిందని తెలిపారు. (చదవండి: వ్యాక్సిన్ల పనితీరును ఎలా లెక్కిస్తారు?!)

ఇక తాము తయారు చేస్తున్న వ్యాక్సిన్‌కు అత్యవసర అనుమతులు ఇవ్వాలంటూ ఫైజర్‌–బయోఎన్‌టెక్‌ కంపెనీలు అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌కు దరఖాస్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డిసెంబర్‌ 10న అడ్మినిస్ట్రేషన్‌ అడ్వైజరీ కమిటీ కీలక సమావేశం జరగనుంది. వ్యాక్సిన్‌కు అత్యవసర అనుమతులు లభిస్తే, 24 గంటల్లోగా రాష్ట్రాలకు పంపిణీ చేసి డిసెంబర్‌ 11న గానీ లేదా 12న గానీ వ్యాక్సినేషన్‌ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే అమెరికా వ్యాపంగా ఉన్న అన్ని రాష్ట్రాలకు వ్యాక్సిన్‌ అందుతుందని డాక్టర్‌ మోన్సెఫ్‌ అన్నారు. వ్యాక్సిన్‌ వల్ల రోగనిరోధక పెరిగి, మొత్తం జనాభాలో 70 శాతం నిరోధకత వస్తే హెర్డ్‌ ఇమ్యూనిటీ వస్తుందని అన్నారు. అన్ని వయసుల వారిపై తమ వ్యాక్సిన్‌ దాదాపు 95 శాతం ఫలితం చూపిస్తోందని ఫైజర్‌–బయోఎన్‌టెక్‌ కంపెనీలు ఇటీవల ప్రకటించాయి.

మరిన్ని వార్తలు