Earthquake: ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం.. పలు నగరాల్లో కంపించిన భూమి..

1 Feb, 2023 20:41 IST|Sakshi

మనిలా: ఫిలిప్పీన్స్‌లో బుధవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.1గా నమోదైంది. న్యూ బటాన్ ప్రాంతం నుంచి 14 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు ఫిలిప్పీన్స్ భూవిజ్ఞాన కేంద్రం తెలిపింది.

భూకంపం ధాటికి పలు దక్షిణాది రాష్ట్రాలోని నగరాల్లో భూప్రకంపనలు వచ్చాయి.  అయితే భూకంపం కారణంగా ఎలాంటి ఆస్తినష్టం గానీ, ప్రాణనష్టం గానీ జరిగినట్లు ఇంకా నిర్ధరణ కాలేదు.

పసిపిక్ మహా సముద్రం ప్రాంతంలోని  ఫిలిప్పీన్స్‌లో తరచూ భూకంపాలు సంభవిస్తూనే ఉంటాయి. ఏటా 20 టైఫూన్లు, ఉష్ణమండల తుఫాన్లు వస్తుంటాయి. ప్రపంచంలోని అత్యంత విపత్తు పీడిత దేశాల్లో ఫిలిప్పీన్స్ ఒకటిగా ఉంది.

చదవండి: పాపం..! డ్యాన్స్‌ చేసినందుకు ఆ జంటకు ఏకంగా పదేళ్లు జైలు శిక్ష

మరిన్ని వార్తలు