రికార్డుల పట్టుగొమ్మ.. అదిరిందమ్మా!

22 Sep, 2021 19:57 IST|Sakshi

ఎన్ని చెర్రీ టమాటాలో.. లెక్కేస్తే.. 839 తేలాయి.. అయితే.. ఇక్కడ కళ్లు తేలేసే విషయమొకటి ఉంది.. ఇవన్నీ కేవలం ఒకే కొమ్మకు కాసినవి.. ఈ విషయం వినగానే.. గిన్నిస్‌ వాళ్లు కూడా మొదట కళ్లు తేలేసి.. తర్వాత తేరుకుని.. లెక్కలేయడానికి బయలుదేరి వస్తున్నారట. ఇంతకీ ఈ భారీ కాతకు కారణమైన వ్యక్తి పేరు చెప్పలేదు కదూ.. డగ్లస్‌ స్మిత్‌.. బ్రిటన్‌లోని స్టాన్‌స్టెడ్‌ అబట్స్‌ గ్రామంలో ఉంటాడు. వీటిని తెంపడానికి గంట సమయం పట్టిందట. గత రికార్డు 488 టమాటాలట. 


వలసదారులపై కొరడా

మెక్సికో మీదుగా టెక్సాస్‌లోకి అక్రమంగా ప్రవేశించిన సుమారు 12వేల హైతీ వలసదారులను అమెరికా అధికారులు విమానాల ద్వారా వెనక్కి పంపించి వేస్తున్నారు. సరిహద్దులు దాటి వస్తున్న వారిని ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. మెక్సికో–అమెరికా సరిహద్దుల్లోని రియో గ్రాండే నది వద్ద వలసదారులను అడ్డుకుంటున్న అమెరికా కస్టమ్స్, బోర్డర్‌ ప్రొటెక్షన్‌ అధికారులు. 


అందాల జాబిలి
నీలి వర్ణం పూసుకున్న ఆకాశంలో స్పష్టమైన కాంతులీనుతున్న పున్నమి చంద్రుడు. ఈ ఫొటోను జర్మనీలోని తౌనుస్‌ ప్రాంతంలో తీశారు. (చదవండి: రియల్‌ ‘బాహుబలి’.. కటౌట్‌ చూసి నమ్మేయాల్సిందే!)

మరిన్ని వార్తలు