అదో విచిత్రం!...సముద్రం పై కదిలే కాంతి చుక్కలు!!

8 Dec, 2021 13:30 IST|Sakshi

మనం ప్రకృతిలో ఉండే కొన్ని రకాల వింతలను మన కళ్లతో నేరుగా చూడగలుగుతాం. అయితే ఒక్కొసారి అవి మనం నేరుగా కాకుండా వీడియోలో రికార్డు చేసినప్పుడు గమనిస్తూ ఉంటాం. అచ్చం అలానే ఇక్కడొక పైలెట్‌ విమానంలో ప్రయాణిస్తుండగా ఒక వీడియో తీసినప్పుడు ఒక వింత సంఘటన చోటుచేసుకుంది.

(చదవండి: అక్కడ చెట్లను తొలగిస్తే.... బహుమతులు ఇస్తారట!)

అసలు విషయంలోకెళ్లితే...పసిఫిక్‌ మహాసముద్రం మీదుగా విమానంలో ప్రయాణిస్తున్న ఒక పైలెట్‌ వీడియో తీసినప్పుడు ఒక వింత సంఘటన చూశాడు. ఒక మూడు కాంతి చుక్కలు ఒకేరీతీలో కదులుతు ఉంటాయి. ఈ మేరకు కొంత దూరం వరకు వెళ్లి ఆ తర్వాత కనుమరుగవ్వడం గమినించాడు. ఈ మేరకు ఈ కదులుతున్న యూఎఫ్‌ఓ ఫ్లీట్‌ని కెమరాలో బంధించడమే కాక సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. పైగా ఈ వీడియోని 39,000 అడుగుల ఎత్తులో తీశారు. దీంతో నెటిజన్లు ఇది ఇప్పటి వరకు వచ్చిన యూఎఫ్‌ఓ ఫ్లీట్‌ వీడియోలో అత్యుత్తమమైనదంటూ ఆ విచిత్రాన్ని చూసి అవాక్కవుతూ రకరకాలుగా ట్వీట్‌ చేశారు.

(చదవండి: బాప్‌రే!.... నెపోలియన్‌ ఖడ్గం వేలంలో రూ. 21 కోట్లు పలికిందట!)

మరిన్ని వార్తలు