వైరల్‌: గాల్లో ఎగురుతున్న పిజ్జాలు.. తినేందుకు పడరాని పాట్లు

30 Aug, 2021 20:10 IST|Sakshi

వ్యోమగామిగా ఉండటం కష్టమైన ఉద్యోగాలలో ఒకటిని నిస్సందేహంగా చెప్పొచ్చు. ఎందుకంటే వారు భూమికి దూరంగా వేలాది మైళ్లు ప్రయాణించి తమకిచ్చిన పనిని పూర్తి చేస్తుంటారు. ఓ రకంగా చెప్పాలంటే రిస్క్‌తో కూడుకున్న జాబ్‌ అనే చెప్పాలి. టెక్నాలజీ పుణ్యమా అని స్పేస్ ప్ర‌యాణం కూడా ముందున్నంత కష్టంగా లేవనే చెప్తున్నారు వ్యోమగామలు. తాజాగా ఓ వ్యోమగాముల బృందం అంతరిక్షంలో పార్టీ చేసుకున్న వీడియో వైరల్‌గా మారింది. 

అంత‌రిక్షంలోని స్పేస్ స్టేష‌న్ల‌లో రోజులు కాదు నెల‌ల కొద్దీ గడిపేలా శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల అంతర్జాతీయ స్పేస్ స్టేష‌న్‌లో ఉన్న కొంద‌రు వ్యోమగాములు అక్కడ స‌ర‌దాగా పిజ్జా పార్టీ చేసుకున్నారు. ఈ వీడియోను ఫ్రెంచ్‌ ఆస్ట్రోనాట్‌.. థామస్ పెస్క్వెట్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ.. స్నేహితులతో కలిసి ఓ తేలియాడే పిజ్జా నైట్, మరోలా చెప్పాలంటే మాకిది భూమిపై శనివారం జరుపుకునే పార్టీలా అనిపిస్తుందని క్యాప్షన్‌గా పెట్టాడు.

ఆ వీడియోలో.. స్పేస్‌ షిప్‌లో ఉన్న కొందరు వ్యోమగాములు  పిజ్జాలు గాలిలో ఎగురుతుంటే.. త‌మ నోటితో ప‌ట్టుకొని  తింటున్నారు. అక్క‌డ ఏ వ‌స్తువు అయినా అలా ఎగురుతూనే ఉంటాయి. స్పేస్‌లో గ్రావిటీ ఉండ‌దనే సంగతి తెలిసిందే. ఏదైనా సరే గాల్లో గింగిరాలు కొట్టాల్సిందే. అంతెందుకు స్పేస్ స్టేష‌న్‌లో ఉన్న‌ప్పుడు మ‌నుషులు కూడా గాలిలో ఎగురుతూనే ఉంటారు. అందుకే.. స్పేస్‌లో ఉండ‌టం చాలా క‌ష్టం. మొత్తానికి.. వ్యోమ‌గాములు పిజ్జా పార్టీ.. సోష‌ల్ మీడియాలో తెగ చ‌క్క‌ర్లు కొడుతోంది. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను ఆశ్చర్యపరచడంతో పాటు ఆకట్టుకుంది.

A post shared by Thomas Pesquet (@thom_astro)

చదవండి: Italy Fire Accident: ఎత్తైన బిల్డింగ్‌.. అగ్నికీలలతో సుందర భవనం ఎలా మారిందంటే..

మరిన్ని వార్తలు