మోదీని సర్‌ప్రైజ్‌ చేసిన బాలుడు.. ఆశ్యర్యపోయిన ప్రధాని

23 May, 2022 11:26 IST|Sakshi

భారత ప్రధాని నరేంద్ర మోదీ.. జపాన్‌ చేరుకున్నారు. రేపు(మంగళవారం) జరగబోయే క్వాడ్‌ సదస్సుల్లో మోదీ పాల్గొననున్నారు. ఇదిలా ఉండగా సోమవారం ఉద‌యం టోక్యో చేరుకున్న‌ మోదీకి ప్రవాస భారతీయులు ఘ‌నస్వాగ‌తం ప‌లికారు. ‘మోదీ మోదీ’, ‘ వందేమాతరం’, ‘భారత్ మాతా కీ జై’ అని నినాదాలు చేస్తూ.. భార‌త జాతీయ జెండాలు ఊపుతూ ప్రధాని మోదీకి వెల్‌కమ్‌ చెప్పారు. 

ఈ నేపథ్యంలో మోదీ వారితో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్బంగా ఓ జపాన్‌ బాలుడు మోదీతో హిందీలో మాట్లాడటంతో ఆయన ఆశ్చర్యపోయారు. "జపాన్‌కు స్వాగతం.. దయచేసి మీ ఆటోగ్రాఫ్‌ నాకు ఇవ్వండి", అని రిత్సుకీ కొబయాషి.. ప్రధాని మోదీని హిందీలో అడిగాడు. ఈ క్రమంలో మోదీ.. "వాహ్.. మీరు హిందీ ఎక్కడ నుండి నేర్చుకున్నారు?.. మీకు బాగా తెలుసా" అని ప్రశంసించారు. అనంతరం అక్కడున్న జపాన్‌ విద్యార్థులకు మోదీ ఆటోగ్రాఫ్‌ ఇచ్చారు. 

అనంతరం రిత్సుకీ మీడియాతో మాట్లాడుతూ..‘‘నేను హిందీ ఎక్కువగా మాట్లాడలేను.. కానీ, నాకు అర్థం అవుతుంది. ప్రధాని మోదీ నా సందేశాన్ని చదివారు. నాకు ఆటోగ్రాఫ్‌ కూడా ఇ‍చ్చారు. దీనికి నేను సంతోషంగా ఉన్నాను’’ అని తెలిపాడు. ఇదిలా ఉండగా.. రిత్సుకీ కొబయాషి ఐదో స్టాండర్ట్‌ చదువుతున్నట్టు చెప్పాడు.

ఇది కూడా చదవండి: భారత్‌ సహా 16 దేశాలపై ట్రావెల్‌ బ్యాన్‌, ఎందుకంటే..

మరిన్ని వార్తలు