భారత స్పేస్‌ అసోసియేషన్‌ని ప్రారంభించనున్న మోదీ

11 Oct, 2021 08:25 IST|Sakshi

న్యూఢిల్లీ:  భారత ప్రధాని నరేంద్ర మోదీ  సోమవారం భారత స్పేస్‌ అసోసియేషన్‌ని(ఐఎస్‌పీఏ) ప్రారంభించనున్నారు. దీనిలో భాగంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రతినిధులతో  ప్రధాని నేడు భేటి కానున్నారు. పైగా ఇది భారత అంతరిక్షరంగం ప్రాముఖ్యతను తెలియజేసే అత్యున్నత సంస్థ.  ఈ మేరకు ఐఎస్‌పీఏ న్యాయపరమైన విధానాలను చేపట్టి వాటిని తన సంస్థ వాటాదారులతో పంచుకుంటుందని తెలిపింది. ఐఎస్‌పీఏ దేశంలోని అంతరిక్ష పరిశ్రమలో వివిధ సాంకేతిక పురోగతులు,  ఆవిష్కరణలతో ముందుకు రానుంది. భారత అంతరిక్ష సంస్థ అసోసియేషన్‌ ప్రధానమంత్రి 'ఆత్మనిర్భర్ భారత్'పై దృష్టిని సారించేలా ప్రతిధ్వనిస్తోంది.

(చదవండి: "మేం ఒత్తిడికి తలొగ్గుతామని భ్రమపడొద్దు")

భారతదేశాన్ని స్వయంశక్తితో సాంకేతికంగా అభివృద్ధి చెందిన దేశంగానే కాక అంతరిక్ష రంగంలో ఒక కీలక పాత్ర పోషిస్తోందని ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ అధికారులు వెల్లడించారు. ఐఎస్‌పీఏ వ్యవస్థాపక సభ్యులలో లార్సన్ అండ్‌ టూబ్రో, నెల్కో (టాటా గ్రూప్), వన్‌వెబ్, భారతీ ఎయిర్‌టెల్, మ్యాప్‌మై ఇండియా, వాల్‌ చంద్‌నగర్ ఇండస్ట్రీస్, అనంత్ టెక్నాలజీ లిమిటెడ్ వంటి ప్రధాన కంపెనీలు ఉన్నాయి. అంతేకాదు గోద్రేజ్, హ్యూస్ ఇండియా, అజిస్టా-బిఎస్‌టి ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్, బిఇఎల్, సెంటమ్ ఎలక్ట్రానిక్స్, మాక్సర్ ఇండియా వంటి ఇతర ప్రధాన కంపెనీల భాగస్వామ్యం కూడా ఉంది.

(చదవండి: 'పీకాబు' అంటూ తన పిల్లల్ని పలకరిస్తున్న టర్కీ చిలుక)

మరిన్ని వార్తలు