భారత ప్రధాని మోదీకి అరుదైన గౌరవం

22 May, 2023 11:38 IST|Sakshi

సువా: భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి విదేశీ గడ్డపై అరుదైన గౌరవం దక్కింది. ఫసిఫిక్‌ ద్వీప దేశం ఫిజీ తమ దేశ అత్యున్నత పురస్కారం ‘ది కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ’ని ప్రధాని  మోదీకి అందజేసింది. ప్రపంచ నాయకత్వ లక్షణాలకుగానూ ఆయనకు ఈ పురస్కారం అందజేస్తున్నట్లు ఫిజీ ప్రకటించింది. తమ దేశ పౌరుడు కాని వ్యక్తికి ఈ పురస్కారం అందించడం అత్యంత అరుదని ఈ సందర్భంగా ఫిజీ ప్రకటించుకుంది.

ఫిజీ ప్రధాని సిటివేని లిగమామడ రబుక నుంచి ఆ మెడల్‌ను భారత ప్రధాని మోదీ అందుకున్నారు.  భారత్‌కు దక్కిన పెద్ద గౌరవమని ఈ సందర్భంగా భారత ప్రధాని కార్యాలయం ప్రకటించింది. ఇదిలా ఉంటే.. గతంలోనూ చాలా దేశాలు ప్రధాని మోదీకి తమ దేశ అత్యున్నత పురస్కారాలు అందజేశాయి. 

ఇదిలా ఉంటే. పాపువా గినియా తరపు నుంచి కూడా ప్రధాని మోదీ ఓ గౌరవాన్ని అందుకున్నారు. కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ లోగోహును పాపువా న్యూ గినియా గవర్నర్ జనరల్ సర్ బాబ్ దాడే.. భారత ప్రధాని మోదీకి అందించారు.

జీ-7 సదస్సు కోసం ప్రత్యేక అతిథిగా  జపాన్‌(హిరోషిమా) వెళ్లిన ప్రధాని మోదీ.. అక్కడ ప్రపంచ దేశల అధినేతలతో భేటీ అయ్యారు. ఆపై అటు నుంచి అటే ఫసిఫిక్‌ ద్వీప దేశాల్లో పర్యటిస్తున్నారాయన.

ఇదీ చదవండి: ఐరాసను సంస్కరించాల్సిందే!

మరిన్ని వార్తలు