Narendra Modi US Visit ఎన్నారైలు ఎంతో ప్రత్యేకం: మోదీ

24 Sep, 2021 04:14 IST|Sakshi
వాషింగ్టన్‌కు చేరుకున్నాక ఎయిర్‌పోర్ట్‌లో ప్రవాసభారతీయులకు మోదీ అభివాదం

వాషింగ్టన్‌: అమెరికా పర్యటనకు వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వాషింగ్టన్‌ విమానాశ్రయంలో పలువురు ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత ప్రధాని తాను బస చేసిన హోటల్లో ఎన్నారైలతో ముచ్చటించారు. ప్రపంచవ్యాప్తంగా భారత సంతతికి చెందిన వారు ప్రత్యేకంగా కనిపిస్తారని ప్రధాని ప్రశంసించారు. ప్రపంచ దేశాల్లో ఉన్న ఎన్నారైలే మన దేశ బలమని ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. వారితో సమావేశమైన ఫొటోలు షేర్‌ చేశారు.
చదవండి: రేపు ఢిల్లీకి సీఎం కేసీఆర్‌.. హస్తినలో మూడు రోజులపాటు

ప్రధాని మోదీ ఏ దేశం వెళ్లినా ప్రవాస భారతీయులతో కచ్చితంగా సమావేశమవుతారు. ఈసారి కోవిడ్‌–19 కారణంగా పెద్ద పెద్ద సమావేశాలేవీ పెట్టుకోలేదు. 2014లో ప్రధానమంత్రి అయ్యాక  మోదీ అమెరికా పర్యటనకు వెళ్లడం ఇది ఏడోసారి. అమెరికాలోని ఎన్నారైల్లో ప్రధానికి మంచి ఆదరణ ఉంది. దీంతో ఆయనకు ప్రవాస భారతీయుల నుంచి ఘనంగా స్వాగతం లభించింది.
 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు