తగలబడిన బస్సులు, ధ్వంసమైన కార్లే సెల్ఫీ పాయింట్లుగా...

12 May, 2022 19:38 IST|Sakshi

New selfie points near burnt buses and cars submerged: రాజికీయ, ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో అల్లర్లు చెలరేగుతున్నసంగతి తెలిసిందే. తొలుత శాంతియుతంగా చేపట్టిన నిరసనలు కాస్తా హింసాత్మకంగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో ఆందోళనకారులు రాజపక్స కుటుంబాల ఇళ్లను, కార్యాలయాలను ధ్యంసం చేశారు కూడా. నేవీ స్థావరంలో తలదాచుకుంటున్న మహిందా రాజపక్స కుటుంబం పై దాడి చేయాలని నిరసనకారలు ఆ ప్రాంతాలను కూడా ముట్టడించారు.

ఈ క్రమంలో ఒకవైపు ఆందోళలనకారులు నిరసనలు చేస్తుంటే మరోవైపు కొంతమంది ఆ ధ్వంసమైన కార్లు, చెరువుల్లో మునిగిపోయిన బస్సుల వద్ద సెల్ఫీలు తీసకుంటున్నారు. ఈ హింసాత్మక అల్లర్లుక కారణంగా శ్రీలంక రక్షణ శాఖ కర్ఫ్యూ విధించడమే కాకుండా ప్రభుత్వ ఆస్తులన తగలబెట్టేవారిని నిర్థాక్షిణ్యంగా కాల్చేయండి అంటూ అదేశాలు జారీ చేసింది కూడా.

ఐతే ఇక్కడ ప్రజలు ధ్వంసం చేసిన ప్రభుత్వ ఆస్తులను సెల్ఫీ పాయింట్లుగా చేసుకుని సెల్ఫీలు దిగేందుకు ఎగబడటం విశేషం. అంతేకాదు ఈ కర్ఫ్యూ​ కారణంగా తాము స్కూల్‌కి వెళ్లలేకపోవడంతో తాము తమ కుటుంబంతో బయటకు వచ్చి సెల్ఫీలు దిగుతున్నమని విద్యార్థులు చెబుతుండటం గమనార్హం. ప్రధానమంత్రి కార్యాలయాలు, నివాసస్థలాల వద్ద బస్సలు, కార్లు దగ్ధం కాగా..  ప్రజలు తమ కుటుంబాలతో సహా వాటి వద్దకు వచ్చి మరీ సెల్ఫీలు దిగుతున్నారు. 

(చదవండి: శ్రీలంక కొత్త ప్రధానిగా రణిల్‌ విక్రమసింఘే ప్రమాణం)

మరిన్ని వార్తలు