పాపం ఎంత దాహం వేసిందో!.....ఆ కోబ్రా గ్లాస్‌తో తాగేస్తోంది.

24 Nov, 2021 15:30 IST|Sakshi

Black Cobra Drinks Water From Glass Video Goes Viral: చాలామంది పాముని చూస్తేనే హడలిపోయి పారిపోతారు. అంతెందుకు కొన్ని విషపూరిత పాములను చూస్తేనే వొళ్లు జలదరిస్తుంది. అలాంటిది ఒక విషపూరితమైన పాముకి గ్లాస్‌తో నీళ్లు తాగించాడు ఇక్కడొక వ్యక్తి.

(చదవండి: ఒక్క యాక్సిడెంట్!...ఆరు కార్లు ధ్వంసం !: షాకింగ్‌ వైరల్‌ వీడియో)

అసలు విషయంలోకెళ్లితే....ఆఫ్రికాలో, ఉప-సహారా ప్రాంతంలో కనిపించే బ్లాక్‌ కోబ్రా వస్తున్నప్పడే ఒక రకమైన శబ్దంతో వస్తాయి. పైగా అవి తమకు ఏదైన అపాయం వాటిల్లుతుందని తెలిస్తే ఒకేసారి పెద్ద ఎత్తున విషాన్ని వెదజిమ్ముతాయి. అలాంటి బ్లాక్‌ కోబ్రాకి ఇక్కడొక వ్యక్తి గ్లాస్‌తో నీళ్లు పట్టిస్తాడు. పైగా ఆ కోబ్రాకి కూడా చాలా దాహం వేసినట్టుంది. తెగ ఆత్రుతగా తాగేస్తుంది. కానీ నీళ్లు తాగిస్తున్న వ్యక్తికి ఏ మాత్రం హానీ చేయదు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. పైగా లక్షల్లో వ్యూస్‌ లైక్‌లు వచ్చాయి. మీరు కూడా ఓ లుక్‌ వేయండి.

(చదవండి: కొడుక్కి అరుదైన వ్యాధి.. తండ్రి హైస్కూల్‌ డ్రాపవుట్‌.. సొంతంగా మందు తయారీ)

A post shared by Royal Pythons (@royal_pythons_)

మరిన్ని వార్తలు