150 మిలియన్‌ ఏళ్ల నాటి జీవికి ఉక్రెయిన్‌ అధ్యక్షుడి పేరు

21 Jul, 2022 12:28 IST|Sakshi

150 million-year-old marine invertebrate Named after Ukraine President: పోలాండ్‌లోని పాలియోంటాలజిస్టులు 150 మిలియన్‌ ఏళ్ల నాటి పురాతన సముద్ర జీవికి ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ పేరు పెట్టారు. ఆఫ్రికాలోని ఇథియోపియాలోని అంటలో సున్నపురాయి నిర్మాణంలో ఈ వింత జీవి పూర్తి శిలాజం సురక్షితంగా ఉంది. ఇది ఒక రకమైన ఈక నక్షత్రం అని చెబుతున్నారు శాస్త్రజ్ఞులు. సముద్రగర్భాంలో ఉండేలా సుమారు 10 పొడవాటి చేతులు, పదునైన టెన్టకిల్‌ లాంటి పంజాలను కలిగి ఉందని పరోశోధకులు పేర్కొన్నారు.

ఉక్రెయిన్‌ స్వేచ్ఛ కోసం పోరాడటమే కాకుండా ఉక్రెయిన్‌ని కాపాడుకునేందుకు శాయశక్తుల కృషి చేసి ప్రపంచ దేశాల ప్రశంసలందుకున్నాడు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమర్‌ జెలెన్‌స్కీ. మాతృభూమి రక్షణకై జెలన్‌స్కీ కనబర్చిన తెగువ ధైర్యసాహసాలకు గౌరవార్థంగా ఈ వింతజీవికి అతని పేరుని సూచించారు. ఈ మేరకు ఆ వింత జీవికి ఆసిచిక్రినైట్స్ జెలెన్‌ స్కీ గా నామకరణం చేశారు. ఇలాంటి వితజీవులకు సమద్ర అడుగుకు చేరుకుని ఉపరితలాన్ని పట్టుకునేలా భారీగా 10 చేతులు, ఆధారంగా ఒక పంజా ఉంటాయి.

ఐతే ప్రస్తుతం ఈ వింత శిలాజం మాత్రం ఒక చేతిని కోల్పోయింది. నిజానికి ఈ వింతజీవులు చనిపోయినప్పుడూ మృదుజాలం క్షీణించి ఎముకలు, చేతులు వంటి అవయవాల సాధారణం విడిపోతాయి. కానీ ఈ శిలాజం మాత్ర విడిపోకుండా పూర్తి నమూన సురక్షితంగా భద్రపరచబడిందని పోలాండ్‌ శాస్తవేత్తలు చెబుతున్నారు. ఈ శిలాజ జీవి ఇతర జంతుకుల దాడి నుంచి బయటపడి ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. ఐతే ఈ జీవులు మానవులకు విషపూరితం కాదు గానీ ఇతర జీవులకు విషపూరితమే అయ్యిండొచ్చని భావిస్తున్నారు. 

(చదవండి: పాపం యాన్‌ యాన్‌.. తిండి మానేసి మరీ కన్నుమూసింది)

మరిన్ని వార్తలు