దయచేసి రక్తపాతాన్ని ఆపెయ్ పుతిన్.. వేడుకున్న పోప్‌

2 Oct, 2022 20:21 IST|Sakshi

రోమ్‌: ఉక్రెయిన్‌లో మారణహోమాన్ని ఆపాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను వేడుకున్నారు పోప్ ఫ్రాన్సిస్. యుద్ధం మొదలైన ఆరు నెలల తర్వాత తొలిసారి ఈమేరకు విజ్ఞప్తి చేశారు. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో వేలాది మందిని ఉద్దేశించి పోప్ మాట్లాడారు. యుద్ధం తీవ్రరూపం దాల్చి అణుబాంబులతో దాడులు చేసుకునే పరిస్థితి వచ్చేటట్టు ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని నెలలుగా ఉక్రెయిన్‌లో జరుగుతున్న రక్తపాతం తనను వెంటాడుతోందని అన్నారు. యుద్దం వల్ల సొంత ప్రజల ప్రేమను కూడా పుతిన్ కోల్పోతున్నారని పేర్కొన్నారు.

యుద్ధం ఆపేందుకు రష్యా శాంతి ప్రతిపాదనలు చేస్తే దయచేసి అంగీకరించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెల్‌న్‌స్కీని కూడా కోరారు పోప్. రష్యాతో శాంతి చర్చలకు సుముఖంగా ఉండాలని సూచించారు. రెండు దేశాల యుద్ధం కారణంగా ప్రపంచదేశాలపై కూడా తీవ్ర ప్రభావం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే ఉక్రెయిన్ ప్రాంతాలను పుతిన్ రష్యాలో విలీనం చేయడం సరికాదని పోప్ అభిప్రాయపడ్డారు. ఇది అంతర్జాతీయ నిబంధనలకు విరుద్దమన్నారు.
చదవండి: నేలపై నుంచి కాల్పులు.. విమానంలోకి దూసుకెళ్లిన బుల్లెట్‌

మరిన్ని వార్తలు