ఇండియాలో ప్ర‌ముఖ ఇంగ్లీష్ ఛాన‌ళ్ల‌ మూత‌!

14 Dec, 2020 18:45 IST|Sakshi

తెలుగు సినిమాలు బోర్ కొడితే హిందీవి చూస్తాం. అవీ బోర్ కొడితే హాలీవుడ్‌ సినిమాల‌ను ఆశ్ర‌యిస్తాం. కొంద‌రైతే సినిమాలు చూడ‌టం త‌ప్ప మ‌రో ప‌నే లేద‌న్న‌ట్లుగా టీవీల‌కు అతుక్కుపోతారు. అలాంటి సినీ ప్రియుల‌కు ఓ విషాద‌క‌ర వార్త‌. ప్ర‌ముఖ ఇంగ్లీష్ మూవీ ఛాన‌ల్స్ హెచ్‌బీఓ, డబ్యూబీ.. ఇండియాలో క‌నిపించ‌కుండా పోనున్నాయి.  రేప‌టి (డిసెంబ‌ర్ 15) నుంచి భారత్‌తో స‌హా పాకిస్తాన్, మాల్దీవులు, బంగ్లాదేశ్‌లో ఈ రెండు ఛానళ్లను వార్నర్‌మీడియా నిలిపివేయనుంది. (చ‌ద‌వండి: డయానాలా మాట్లాడగలనా అని భయం)

అయితే ద‌క్షిణాసియాలో పిల్ల‌లు ఎక్కువ‌గా ఆద‌రించే కార్టూన్ నెట్‌వ‌ర్క్‌, పోగో ఛాన‌ళ్లను కొనసాగిస్తామని, అదేవిధంగా ఇంటర్నేషనల్‌ సీఎన్‌ఎన్‌ను కూడా ప్రసారం చేస్తామని వార్నర్‌ మీడియా యాజమాన్యం పేర్కొంది. ప్ర‌స్తుతం ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లు డిస్నీ హాట్‌‌ స్టార్‌, నెట్‌ఫ్లిక్స్‌ లాంటి ఆన్‌లైన్‌ వేదికలు అందుబాటులోకి  వచ్చిన తరువాత ఈ ఛానళ్లను చూడటానికి ఎవరు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో ఈ కంపెనీ ఇత‌ర ఓటీటీ యాప్‌ల‌కు పోటీగా హెచ్‌బీఓ మాక్స్ అనే కొత్త స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ను తీసుకువ‌చ్చిన విష‌యం తెలిసిందే. (చ‌ద‌వండి: థియేటర్‌తో పాటు ఓటీటీలోనూ విడుదల)

మరిన్ని వార్తలు