అమెరికా చరిత్రలో ఇదొక నూతన అధ్యాయం

8 Nov, 2020 07:42 IST|Sakshi

అధ్యక్ష ఎన్నికల్లో గెలిచాక డెమొక్రాట్ల తొలి బహిరంగ సభ

సాక్షి, వాషింగ్టన్‌: అధ్యక్ష ఎన్నికల్లో తన గెలుపు అమెరికన్ల విజయమని జో బైడెన్ అన్నారు. డెమొక్రాట్ల విజయోత్సవ సభలో ఆయన ప్రసంగించారు. అమెరికన్ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని తెలిపారు. ‘‘అమెరికన్ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. అమెరికా చరిత్రలో ఇదొక నూతన అధ్యాయం. 7.4 కోట్ల మంది అమెరికన్లు డెమొక్రాట్లకు ఓటేశారు. అమెరికన్లు తమ భవిష్యత్ కోసం ఓటేశారు. మీరు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా. ప్రజాస్వామ్య బద్ధంగానే పరిపాలన చేస్తా. ప్రత్యర్ధులు మన శత్రువులు కాదు.. వారు కూడా అమెరికన్లే. అమెరికాకు కొత్త రోజులు రాబోతున్నాయి. కమలా హ్యారిస్ అద్భుత నాయకురాలు. అమెరికాలో వర్ణవివక్ష లేకుండా అభివృద్ధి చేసుకుందాం’’ అని పేర్కొన్నారు. (చదవండి: బైడెన్‌కే పట్టాభిషేకం)

ప్రజాస్వామ్యాన్ని కాపాడారు: కమలాహారిస్‌
అమెరికన్లు ప్రజాస్వామ్యాన్ని కాపాడారని అమెరికా మొదటి మహిళా ఉపాధ్యక్షురాలిగా పదవిని చేపట్టనున్న కమలా హ్యారిస్‌ అన్నారు. ‘‘అమెరికా చరిత్రలో నూతన అధ్యాయం. ఉపాధ్యక్ష ఎన్నికల్లో నా గెలుపు మహిళా లోకం విజయం. అమెరికా ప్రజలు తమ గళాన్ని గట్టిగా వినిపించారని’’ ఆమె పేర్కొన్నారు. (చదవండి: చరిత్ర సృష్టించిన కమలా హ్యారిస్‌)

మరిన్ని వార్తలు