బ్రిటన్‌ ప్రధాని భారత పర్యటన ఖరారు

16 Mar, 2021 10:54 IST|Sakshi

లండన్‌: బ్రిటన్ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ఏప్రిల్‌ చివరి వారంలో భారత్‌కు రానున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని బ్రిటన్‌ ప్రధాని కార్యాలయం తెలిపింది. యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ)  నుంచి బ్రిటన్‌ బయటకు వచ్చిన తరువాత  బోరిస్‌  చేస్తోన్న మొదటి అంతర్జాతీయ పర్యటన ఇది.  యూకే  అవసరాలను మెరుగుపర్చడం కోసం ఈయూ నుంచి బ్రిటన్‌ బయటకు వచ్చిన విషయం తెలిసిందే.

కాగా, ఈ ఏడాది రిపబ్లిక్‌ వేడుకల్లో ముఖ్య అతిథిగా బోరిస్‌ పాల్గొనాల్సి ఉండగా, బ్రిటన్‌లో కరోనా కొత్త స్ట్రెయిన్‌ కేసులు అధికంగా నమోదుకావడంతో తన పర్యటనను రద్దు చేసుకొన్నారు. దాంతో ఇరు దేశాల మధ్య జరగాల్సిన  వాణిజ్య చర్చలు నిలిచిపోయాయి. ప్రస్తుత పర్యటనతో ఈ చర్చలు కొలిక్కిరానున్నాయి. రాబోయే రోజుల్లో బ్రిటన్‌  ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ రివ్యూలో భాగంగా ఇండో-పసిఫిక్ ప్రాంతం వైపు దృష్టి సారించనున్నట్లు  జాన్సన్ ప్రభుత్వం తెలిపింది.ఈ ప్రాంతం భవిష్యత్తులో  ప్రపంచంలో భౌగోళిక రాజకీయ కేంద్రంగా ప్రాతినిధ్యం వహించనుంది.

బ్రెగ్జిట్ అనంతరం, నెలకొన్న పరిస్థితులు, వాణిజ్యం కోసం కొత్త మార్గాలను  అన్వేషించడానికి 11 దేశాల కూటమిలో సభ్యత్వం కోరుతూ, గత నెలలో బ్రిటన్ ట్రాన్స్-పసిఫిక్ పార్ట్‌నర్‌షిప్ కోసం సమగ్ర మరియు ప్రగతిశీల ఒప్పందంలో (సిపిటిపిపి) చేరాలని ఇండియాకు అధికారికంగా అభ్యర్థన చేసింది.(చదవండి: రష్యాను అధిగమించిన భారత్‌..!)

>
మరిన్ని వార్తలు