జో బైడెన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ

24 Sep, 2021 22:54 IST|Sakshi

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలపై చర్చించారు. జోబైడన్‌ మాట్లాడుతూ.. భారత్‌-అమెరికా బంధం మరింత బలోపేతం కావాలన్నారు. కోవిడ్‌ సమస్యలపై కలిసి పనిచేస్తామని బైడన్‌ తెలిపారు. ఇండో- పసిఫిక్‌ ప్రాంతంలో స్వేచ్ఛ కోసం కలిసి పోరాడతామని పేర్కొన్నారు. భారత్‌-అమెరికా సంబంధాల్లో కొత్త శకం మెదలు అవుతుందని జో బైడెన్‌ వెల్లడించారు. ఇరు దేశాల సంబంధాల్లో టెక్నాలజీ కీలక పాత్రపోషించనుందన్నారు. వాణిజ్య రంగంలో పరస్పర  సహకారం లాభాదాయకం అని  బైడెన్‌ సృష్టం చేశారు.

చదవండి:
కమలా హ్యారిస్‌కు ప్రధాని మోదీ బహుమతులు.. వాటి ప్రత్యేకత ఇదే!

మరిన్ని వార్తలు