Narendra Modi US Visit ఐరాసలో ప్రసంగించనున్న భారత ప్రధాని

25 Sep, 2021 12:06 IST|Sakshi

మరికొన్ని గంటల్లో ఐక్య రాజ్య సమితిలో ప్రసంగం

న్యూయార్క్‌: అమెరికా పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బిజీబిజీగా ఉన్నారు. నిన్న ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్‌తో సమావేశమైన విషయం తెలిసిందే. వారితో ద్వైపాక్షిక అంశాలతో పాటు అంతర్జాతీయ పరిణామాలపై చర్చించారు. అంతకుముందే ప్రముఖ సంస్థల సీఈఓలతో సమావేశమై ‘భారత్‌లో పెట్టుబడులు పెట్టాలి’ అని ఆహ్వానించారు. 
చదవండి: తెలంగాణ పర్వతారోహకుడికి సీఎం జగన్‌ భారీ ఆర్థిక సహాయం

తాజాగా ఐక్య రాజ్య సమితిలో ప్రసంగించేందుకు ప్రధాని మోదీ న్యూయార్క్‌ చేరుకున్నారు. న్యూయార్క్‌ చేరుకున్న మోదీకి ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. వందేమాతరం అనే నినాదాలు మార్మోగాయి. 76వ నేషనల్‌ జనరల్‌ అసెంబ్లీ సమావేశం నేడు జరగనుంది. భారత కాలమాన ప్రకారం సాయంత్రం 6 గంటలకు ఐరాసలో ప్రధాని ప్రసంగించనున్నారు. 2014లో ప్రధానమంత్రి అయ్యాక  మోదీ అమెరికా పర్యటనకు వెళ్లడం ఇది ఏడోసారి. అమెరికాలోని ఎన్నారైల్లో ప్రధానికి మంచి ఆదరణ ఉంది.
 

మరిన్ని వార్తలు