ఇక బ్రిటన్‌ రాజు చార్లెస్‌

9 Sep, 2022 01:50 IST|Sakshi

బల్మోరల్‌ క్యాజిల్‌:  బ్రిటన్‌ రాజకుటుంబ నిబంధనల ప్రకారం... రాజు లేదా రాణి మరణిస్తే వారి వారసుడు/వారసురాలిగా మొదటి వరుసలో ఉన్నవారు తక్షణమే బ్రిటన్‌ రాజు/రాణిగా మారిపోతారు. ఈ లెక్కన ఎలిజబెత్‌–2 రాణి వారసుడిగా మొదటి వరుసలో మొదటి స్థానంలో ఉన్న పెద్ద కుమారుడు ప్రిన్స్‌ చార్లెస్‌ బ్రిటన్‌ రాజుగా మారినట్లే. అయితే, అధికారికంగా పగ్గాలు చేపట్టడానికి, పట్టాభిషేకానికి నిర్దేశిత లాంఛనాలు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందుకు కొన్ని నెలలు లేదా మరింత ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. ఎలిజబెత్‌–2 విషయానికొస్తే తండ్రి మరణంతో 1952 ఫిబ్రవరి 6న రాణిగా మారారు. 16 నెలల తర్వాత.. 1953 జూన్‌ 2న పట్టాభిషక్తురాలయ్యారు.  

  • రాణి మరణించాక 24 గంటల్లోపు కొత్త రాజు పేరును యాక్సెషన్‌ కౌన్సిల్‌ లండన్‌లోని సెయింట్‌ జేమ్స్‌ ప్యాలెస్‌ నుంచి అధికారికంగా ప్రకటిస్తుంది.  
  • కొత్త రాజుకు విధేయత ప్రకటిస్తూ పార్లమెంట్‌ సభ్యులు ప్రమాణం చేస్తారు.  
  • ప్రైవీ కౌన్సిల్‌ ఎదుట నూతన రాజు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది.   
  • కొత్త రాజు పాలన మొదలైనట్లు యూకేలో పలుచోట్ల బహిరంగంగా ప్రకటిస్తారు.  
  • పట్టాభిషేక ప్రమాణ చట్టం–1689 ప్రకారం ప్రిన్స్‌ చార్లెస్‌ తన పట్టాభిషేక కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేయాలి.     

ఇదీ చదవండి: బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌-2 కన్నుమూత

మరిన్ని వార్తలు