ప్రిన్స్‌ హ్యారీ మళ్లీ రాచ విధుల్లోకి రారు

20 Feb, 2021 02:04 IST|Sakshi

లండన్‌: ప్రిన్స్‌ హ్యారీ, ఆయన భార్య మెఘన్‌ మార్కెల్‌ బ్రిటన్‌ రాజ కుటుంబంలోకి క్రియాశీల సభ్యులుగా తిరిగి రారని బకింగ్‌ హామ్‌ ప్యాలెస్‌ శుక్రవారం ప్రకటించింది. హ్యారీ నానమ్మ, రాణి ఎలిజబెత్‌–2(94) తరఫున విడుదల చేసిన ఆ ప్రకటనలో..‘డ్యూక్‌ ఆఫ్‌ సస్సెక్స్‌ ప్రిన్స్‌ హ్యారీ(36), ఆయన భార్య డచెస్‌ ఆఫ్‌ సస్సెక్స్‌ మెఘన్‌ మార్కెల్‌(39) ఏడాదిలోగా తిరిగి క్రియాశీల విధుల్లోకి చేరతామంటూ చేసిన ప్రకటన గడువు పూర్తి కావస్తోంది. దీంతో నిర్ణయం తెలపాల్సిందిగా రాణి వారికి లేఖ రాశారు.

తాము తిరిగి రామంటూ హ్యారీ దంపతులు సమాధానం ఇచ్చారు. దీంతో ఆ విధులన్నీ తిరిగి రాణికే దఖలు పడ్డాయి. వాటిని ఆమె కుటుంబంలోని ఇతరులు తిరిగి పంపిణీ చేయనున్నారు’అని ఆమె వివరించింది. ఆర్థికంగా స్వతంత్రంగా జీవించేందుకు వీలుగా రాజకుటుంబం క్రియాశీలక విధుల నుంచి వైదొలుగుతున్న ప్రిన్స్‌ హ్యారీ దంపతులు గత ఏడాది మార్చిలో ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వారిప్పుడు అమెరికాలో నివాసం ఉంటున్నారు. 

మరిన్ని వార్తలు