ఫ్రాన్స్‌లో భద్రతా బిల్లుపై జనాగ్రహం

29 Nov, 2020 05:24 IST|Sakshi
పారిస్‌లో నిరసనకారులు తగులబెట్టిన కారు మంటలను ఆర్పుతున్న ఫైర్‌ సిబ్బంది

పారిస్‌: విధి నిర్వహణలో ఉన్న పోలీసుల ఫొటోలను షేర్‌ చేయడాన్ని నిషేధిస్తూ ఫ్రాన్స్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన భద్రతా బిల్లుపై ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ శనివారం దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఇటీవల ఫ్రాన్స్‌లో ఓ నల్ల జాతీయుడిని పోలీసులు కొడుతున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. అనంతరం ప్రభుత్వం భద్రతా బిల్లును తీసుకొచ్చింది. ఇది పార్లమెంట్‌ దిగువ సభలో ఆమోదం పొందింది. ఇక సెనేట్‌లో ఆమోదం పొందాల్సి ఉంది. ఈ కొత్త బిల్లు ప్రకారం.. విధుల్లో ఉన్న పోలీసుల ఫోటోలు తీయడం, వాటిని షేర్‌ చేయడం వంటివి చేస్తే ఏడాది జైలు శిక్ష, 53 వేల డాలర్ల జరిమానా విధిస్తారు.
 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు