ముదిరిన రాజకీయ సంక్షోభం.. పార్లమెంటులోకి ప్రవేశించిన ఆందోళనకారులు

30 Jul, 2022 19:17 IST|Sakshi

బాగ్ధాద్: వందలాది మంది నిరసనకారులు ఇరాక్ పార్లమెంటును దిగ్బంధించారు. షియా నేత ముక్తదా అల్ సద్రకు మద్దతుగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. పోలీసులు టియర్‌ గ్యాస్ ప్రయోగించినా, గాల్లోకి కాల్పులు జరిపినా లెక్క చేయకుండా సిమెంటు బారీకేడ్లను తొలగించి మరీ పార్లమెంటులోకి ప్రవేశించారు. నిరసనకారులు పార్లమెంటును దిగ్బంధించడం వారం రోజుల్లో ఇది రెండోసారి కావడం గమనార్హం.

గతేడాది అక్టోబర్‌లో జరిగిన ఎన్నికల్లో ముక్తదా అల్ సద్రకు చెందిన పార్టీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే కావాల్సిన మెజార్టీ మాత్రం అందుకోలేకపోయింది. దీంతో ఇటీవలే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం విపక్షాలకు ఇచ్చారు ముక్తదా. ఫలితంగా దేశంలో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది.

ఇటీవలే విపక్షాలు మహమ్మద్ అల్‌ సుదానీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాయి. దీన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇరాన్ మద్దతుదారులు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వీల్లేదని పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నారు.
చదవండి: సర్వస్వం కోల్పోయినా పెంపుడు కుక్కను మాత్రం వదల్లేదు..

మరిన్ని వార్తలు