Russia Victory Day: రష్యాకు షాక్‌.. అంబాసిడ‌ర్‌ సెర్గీపై దాడి

9 May, 2022 17:26 IST|Sakshi
సిరా మరకలతో సెర్గీ ఆండ్రియేవ్‌

వార్సా: ఉక్రెయిన్‌లో రష్యా దాడులు కొనసాగుతున్నవేళ ర‌ష్యా విక్ట‌రీ డే(మే 9వ తేదీ) సెల‌బ్రేట్ చేసుకుంటున్న విష‌యం తెలిసిందే. రష్యా విక్టరీ డే సందర్బంగా వ్లాదిమిర్‌ పుతిన్.. మాతృభూమి కోసం రష్యా వీరులు పోరాడుతున్నారు. ఉక్రెయిన్‌లోని ‘మాతృభూమి’ని రష్యా రక్షించుకునేందుకే ఈ ప్రయత్నం. దేశ భవిష్యత్తు కోసమే ఇదంతా. కాబట్టి, రెండో ప్రపంచ యుద్ధం నేర్పిన పాఠాలను ఎవరూ మర్చిపోవద్దూ అంటూ కామెంట్స్‌ చేశారు. 

ఇదిలా ఉండగా.. ర‌ష్యా విక్ట‌రీ డే సెల‌బ్రేషన్స్‌లో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. పోలాండ్‌ రాజధాని వార్సాలో ర‌ష్యా అంబాసిడ‌ర్ సెర్గీ ఆండ్రియేవ్‌పై ఉక్రేనియన్లు దాడి చేశారు. రెండ‌వ ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో మృతిచెందిన రెడ్ ఆర్మీ సైనికులకు సెర్గీ ఆండ్రియేవ్‌ నివాళులు అర్పిస్తుండగా ఉక్రెయిన్‌ జెండాలు పట్టుకున్న కొందరు వ్యక్తులు ఆయనపై ఎరుపు రంగు సిరాను చల్లి నిరసనలు తెలిపారు. ఈ దాడిలో తనకు గాయాలేవీ కాలేదని సెర్గీ చెప్పారు. 

ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్‌లో దాడుల నేపథ్యంలో విక్టరీ సందర్భంగా పోలాండ్‌లో పుష్ప నివాళి ఈవెంట్‌ను ర‌ద్దు చేయాలని అధికారులు ర‌ష్యాను కోరారు. కానీ, సెర్గీ ఆండ్రియేవ్‌ మాత్రం సైనిక శ్మ‌శాన‌వాటిక‌కు వచ్చి పెద్ద సాహసం చేశారు. దీంతో ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. 


 

మరిన్ని వార్తలు