ఏం మాట్లాడుతున్నావ్‌! అంటూ పాక్‌ ప్రధానిని దుమ్మెత్తిపోస్తున్న ప్రజలు

13 Feb, 2023 19:30 IST|Sakshi

పాక్‌ తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ చేసిన ఒక ప్రకటన ఆయనను విమర్శల పాలు చేసింది. ఏదో తన దేశీయుల గొప్పగా భావిస్తారని.. చెబితే అది కాస్త షరీఫ్‌కి తలనొప్పిగా మారింది. ఈ మేరకు ప్రధాని షరీఫ్‌ మన పాకిస్తాన్‌కి చెందిన అజ్ఞాత వ్యక్తి ఒకరు టర్కీ, సిరియా భూకంప బాధితులకు 30 మిలియన్ల డాలర్లు సాయం అందిచాడని గర్వంగా చెప్పారు.

అమెరికాలోని టర్కీ రాయబార కార్యాలయానికి వెళ్లి మరీ సాయం అందిచినట్లు తెలిపారు. ఇది నన్ను ఎంతగానో కదిలించింది. ఇది మానవాళి అధిగమించలేని అసమానతలపై విజయం సాధించేలా చేసే అద్భతమైన దాతృత్వ చర్యగా పేర్కోన్నారు. దీనికి తాను ఎంతగానో గర్వపడుతున్నానంటూ ట్విట్టర్‌ వేదికగా గొప్పగా చెప్పుకొచ్చారు. దీంతో షరీఫ్‌ చేసిన ప్రకటన అక్కడ ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తానీయులకు మింగుడుపడలేదు.

దీంతో ట్విట్టర్‌ వేదికగా షరీప్‌పై పలు విమర్మలు ఎక్కుపెట్టారు. తన సొంత దేశం అస్తవ్యస్తంగా ఉంటే ఎందుకు సాయం చేసేందుకు ముందుకు రాలేదంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. మీలాంటి అవినీతి పరులు ఉన్నారు కాబట్టి సాయం చేసేందుకు రాలేదు కాబోలు అంటూ షరీఫ్‌కి చివాట్లు పెట్టారు నెటిజన్లు. అంతేగాదు ఆ అనామకుడు పాక్‌ దౌత్య కార్యాలయంలోకి వెళ్లి వరదల్లో అల్లకల్లోలం అయిన తన దేశానికి ఎందుకు ఇవ్వలేదనేది పాక్‌ రచయిత్రి అయేషా సిద్ధిఖా కూడా ప్రధాని షరీఫ్‌ని ప్రశ్నించారు. ఎందుకంటే  అధికారంలో ఉన్నది దొంగలని అతనికి తెలుసు అందుకే ఇవ్వలేదని, ఇది నిజంగా సిగ్గుతో చచ్చిపోవాల్సిన విషయం అంటూ షరీఫ్‌ని నెటిజన్లు సోషల్‌ మీడియా వేదికగా ఏకిపరేశారు. 

(చదవండి: మరోసారి భారత్‌కు ధన్యవాదాలు! ఎప్పటికీ మనం దోస్తులమే!: టర్కీ రాయబారి)

మరిన్ని వార్తలు