చీరకట్టు ‘ప్రియుడు’.. ఇది ఏ ఫ్యాషనో తెలుసా?

28 Oct, 2021 21:21 IST|Sakshi

ఇటలీ: గతంలో వేషధారణకు ఒక ప్రత్యేకతే ఉండేది. ఆడ మగ అనే తారతమ్యం లేకుండా ఇప్పటి వరకు మగవాళ్లు వేసుకునే బట్టలను ఆడవాళ్లు వేసుకున్నారు. కానీ ఆడవాళ్లు ధరించే వాటిని మగవాళ్లు ఎప్పుడూ వేసుకోలేదు. కానీ ఇటీవల కాలంలో ఆడవాళ్ల వేషధారణను మగవాళ్లు ధరించటం ఒక ఫ్యాషన్‌గా మారింది. అయితే హ్యారీ స్టైల్స్, రణవీర్ సింగ్ మరియు కే-పాప్ బ్యాండ్ బీటీఎస్‌  వంటి స్టార్‌లు సైతం ఈ ఫ్యాషన్‌ ప్రస్తావన ముందుకు తీసుకు వచ్చారు గానీ ఆచరణ సాధ్యం కాలేదు.

(చదవండి: హృదయాన్ని కదిలించే "స్వీట్‌ రిక్వస్ట్‌")

అయితే ఈ ఫ్యాషన్‌ని ఆండ్రోజినస్‌ ఫ్యాషన్‌గా పిలుస్తారు. అంతేకాదు కొల్‌కతాకు చెందిన వ్యక్తి ఈ ఫ్యాషన్‌ అనుకరించేలా ఇంటర్నెట్‌లో ఒక విప్లవాన్ని తీసుకువచ్చి అందర్నీ ఆశ్చర్యానికి గురుచేస్తున్నారు. ఏంటి ఇందంతా అని అనుకోకండి. అసలు విషయం ఏంటంటే కోల్‌కతాకు చెందిన పుష్పక్‌ సేన్‌ ఎరుపు రంగు చీర, నలుపు కళ్ల జోడు ధరించి పాతకాలంలో మాదిరిగా కూడా ఒక గొడుగు వెంట తెచుకుని ఫ్యాషన్‌ రాజధానులుగా పేరుగాంచిన వీధులో తిరుగుతాడు.

అయితే ఈ విధంగా సేన్ ప్రపంచంలోని ప్రధాన ఫ్యాషన్ హబ్‌లలో ఒకటైన మిలన్ వీధుల్లో  ఫోటోషూట్‌లకి ఫోజు ఇస్తాడు. అంతేకాదు సేన్‌ ఇటలీలోని ఫ్లోరెన్స్‌లో ఫ్యాషన్ మార్కెటింగ్ అండ్‌ కమ్యూనికేషన్స్ విద్యార్థి కావడం విశేషం. ఈ మేరకు సేన్‌ సోషల్‌ మీడియాలో ఈ ఫోటోలతో పాటుగా  "చీరలో ఉన్న మనిషిని ఎవరు తమతో పాటు తీసుకువెళ్లరు.  ప్రపంచంలోని ప్రధాన ఫ్యాషన్ రాజధానులలో ఒకటైన వీధుల్లో ఎవరు నడుస్తున్నారో ఊహించండి?" అంటూ క్యాప్షన్‌ని జోడించి మరీ పోస్ట్‌ చేస్తాడు. దీంతో ఈ ఫోటో కాస్త నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. అంతేకాదు నెటిన్లు సేన్‌ని ఎంత అద్భతంగా కనిపిస్తున్నాడో అంటూ తెగ మెచ్చుకుంటూ ట్వీట్‌ చేశారు.

(చదవండి: కూరగాయల దండతో అసెంబ్లీకి)

మరిన్ని వార్తలు