‘ఏదైనా జరగచ్చు’.. ఐసీసీకి స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చిన రష్యా ప్రతినిధి

22 Mar, 2023 11:45 IST|Sakshi

రష్యా భద్రతా మండలి డిప్యూటీ చైర్మన్ డిమిత్రి మెద్వెదేవ్ అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ)కు స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. ఐసీసీ ఇటీవల రష్యా అధ్యక్షుడు వ్లాద్‌మిర్‌ పుతిన్‌పై అరెస్ట్‌ వారెంట్‌ జారి చేసిన నేపథ్యంలో తీవ్ర పరిణామాలాను ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించారు. పుతిన్ విధేయుడైన మెద్వెదేవ్ టెలిగ్రామ్‌లో.. పెద్దమనుషులు, ప్రతి ఒక్కరూ దేవునికి, క్షిపణి దాడులకు జవాబుదారీగా ఉంటారు. ఉత్తర సముద్రంలో రష్యన్ యుద్ధనౌక నుంచి రాబోయే హైపర్‌సోనిక్ ఓనిక్‌లు హేగ్‌లోని అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుపై క్షిపణి పడవచ్చు.. ఐసీసీ న్యాయమూర్తులు ఆకాశం వైపు ఓ కన్నేసి ఉంచాలని వార్నింగ్‌ ఇచ్చారు.

ఐసీసీ కోర్టును "దయనీయమైన అంతర్జాతీయ సంస్థ" అని పేర్కన్నాడు. గత ఏడాది ఫిబ్రవరిలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి పిల్లలను చట్టవిరుద్ధంగా బహిష్కరించడం, ఉక్రెయిన్ భూభాగం నుంచి రష్యన్ ఫెడరేషన్‌కు ప్రజలను చట్టవిరుద్ధంగా బదిలీ చేయడం వంటి అనుమానాలపై పుతిన్‌ను అరెస్టు చేయాలని ఐసీసీ పిలుపునిచ్చింది. గత ఏడాది కాలంగా ఉక్రెయిన్‌ మీద రష్యా యుద్ధం ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే యుధ్దం ముసుగులో పలు నేరాలు జరుగుతున్నాయని వాటికి పుతిన్ కారణమని ఐసిసి ఆరోపించింది, అయితే ఉక్రెయిన్‌లో ఎటువంటి దుశ్చర్యలకు పాల్పడలేదని రష్యా ఐసీసీ ఆరోపణలను ఖండించింది. ఇదిలా ఉండగా. ఈ అరెస్ట్ వారెంట్‌పై రష్యా ప్రభుత్వం ఐసీసీ అధికార పరిధిని అంగీకరించేది లేదని స్పష్టం చేసింది. మరో వైపు పుతిన్‌పై అరెస్టు వారెంట్‌ జారీ చేయడంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సమర్థించారు.

మరిన్ని వార్తలు