Russia War: ఇక చాలు మీరు రెస్ట్‌ తీసుకోండి.. బలగాలకు పుతిన్‌ కీలక ఆదేశాలు

4 Jul, 2022 20:33 IST|Sakshi

ఉక్రెయిన్‌లో రష్యా బలగాల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఉక్రెయిన్‌లో ఇప్పటికే పలు ప్రాంతాలను స్వాధీనం చేసుకున్న రష్యా.. మరో ప్రాంతాన్ని హస్తగతం చేసుకుంది. డాన్‌బాస్‌లో ఉన్న లుహాన్స్క్ ప్రాంతాన్ని ర‌ష్యా ద‌ళాలు స్వాధీనం చేసుకున్నాయి. 

అయితే, లూహాన్స్క్ ప్రాంతంలోని లిసిచాన్స్క్ నగరాన్ని పూర్తిగా తమ స్వాధీనంలోకి తీసుకున్నట్టు రష్యా రక్షణ శాఖ తెలిపింది. లిసిచాన్స్క్ నగరం చుట్టూ ఉన్న గ్రామాలను కూడా పూర్తిగా మోహరించి మొత్తంగా నగరాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నామని రష్యా రక్షణ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. దీంతో, ఉక్రెయిన్‌ సేనలకు ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ కంగ్రాట్స్ తెలిపారు. ర‌క్ష‌ణ మంత్రి సెర్గీ షోగూతో క‌లిసి టీవీలో పుతిన్ సందేశం ఇచ్చారు. 

 ఈ సందర్భంగా పుతిన్‌.. తన దేశ బలగాలను ప్రశంసించారు. లుహాన్స్క్ ప్రాంత ఆక్రమణలో పోరాడిన బలగాలను రెస్ట్‌ తీసుకోవాలని పుతిన్‌ సూచించారు. ఈ క్రమంలోనే  ఉక్రెయిన్‌లోని మిగితా ప్ర‌దేశాల్లో ఉన్న మిలిట‌రీ యూనిట్లు మాత్రం దాడులను కొన‌సాగించాల‌న్నారు. కాగా, ఉక్రెయిన్‌ దక్షిణ ప్రాంతంలోని మైకోలేవ్ నగర శివార్లలో ఉన్న విదేశీ విమానాల స్థావరాన్నీ నేలమట్టం చేశామని రష్యా ఆర్మీ ప్రకటించింది. మ‌రోవైపు, న‌ల్ల స‌ముద్రంలోని స్నేక్ ఐల్యాండ్‌ను స్వాధీనం చేసుకున్న ఉక్రెయిన్ అక్క‌డ త‌మ జెండాను ఎగుర‌వేసింది. 

ఇది కూడా చదవండి: ప్రతీపనిపై నిఘానే! కోట్ల మంది డాటా లీక్‌.. జిన్‌పింగ్‌ గూడుపుఠాణి

మరిన్ని వార్తలు