ఉక్రెయిన్‌ని నివారించేలా రష్యా ఎత్తుగడ.. పశ్చిమ దేశాలకు స్ట్రాంగ్‌ వార్నింగ్‌

21 Sep, 2022 13:34 IST|Sakshi

Military mobilisation: గత కొన్ని రోజులుగా ఉక్రెయిన్‌ దళాలు రష్యా బలగాలపై పైచేయి సాధిస్తూ...రష్యా ఆక్రమిత ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. దీంతో రష్యా అధ్యక్షుడు బహిరంగంగా మరిన్ని సైనిక సమీకరణలను చేయనున్నట్లు ప్రకటించారు. అంతేకాదు రష్యా తన భూభాగాలను రక్షించడానికి సుమారు రెండు మిలియన్ల బలమైన సైనిక దళాలను రంగంలోకి దింపనుందని అన్నారు. అలాగే పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌లో శాంతి కోరుకోవడం లేదని, రష్యాను నాశనం చేయాలని చూస్తున్నాయంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు.

తాను తమ మాతృభూమిని రక్షించుకోవడానికి, సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి సైనిక సమీకరణకై జనరల్‌ స్టాఫ్‌కి మద్దతు ఇవ్వాలని భావిస్తున్నానని చెప్పారు. అంతేగాదు తూర్పు ఉక్రెయిన్‌లో డాన్‌బాస్‌ ఇండస్ట్రీయల్‌ హార్ట్‌ల్యాండ్‌ ప్రాంతాన్ని విముక్తి చేయడమే తన లక్ష్యం అని పుతిన్‌ పునరుద్ఘాటించారు. అలాగే పశ్చిమ దేశాలు రష్యాపై అణు బ్లాక్‌మెయిల్‌కి దిగుతున్నాయని, దీనికి తాము తమ ఆయుధాలతో సరైన విధంగా బదులివ్వగలమని అ‍న్నారు. ఇవేమి ప్రగల్పాలు, బెదిరింపులు కాదని తెగేసి చెప్పారు.

అయినా రష్యా 2014లో ఉక్రెయిన్‌లో డోన్‌బాస్‌ ప్రాంతాన్ని ఆక్రమించుకుని లుహాన్స్క్‌, డోనెట్స్క్‌లను స్వతంత్ర రాష్ట్రాలుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. యుద్ధం మొదలైన ప్రాంభంలోనే దాదాపు 60 శాతం భూభాగాన్ని తమ నియంత్రణలోకి తెచ్చుకుంది రష్యా. జులై నాటికి మొత్తం లుహాన్స్క్‌ని స్వాధీనం చేసుకుంది. గత కొన్ని రోజులుగా ఖార్కివ్‌ ప్రావిన్స్‌ నుంచి రష్యా బలగాలు వెనక్కి మళ్లేలా చేశాయి ఉక్రెయిన్‌ సేనలు. దాదాపు రష్యా ఆక్రమించుకున్న ప్రాంతాలన్నింటిని కైవసం చేసుకుంది ఉక్రెయిన్‌. ఈ నేపథ్యంలోనే రష్యా అధ్యక్షడు పుతిన్‌  మరిన్ని బలగాలను మోహరింప చేసే దిశగా పావుల కదుపుతున్నాడు.  

(చదవండి: ఔను మోదీ చెప్పింది కరెక్ట్‌! ప్రశంసించిన ఫ్రాన్స్‌ అధ్యక్షుడు)

మరిన్ని వార్తలు