Western sanctions: సౌదీ యువరాజుకు పుతిన్ సందేశం!

4 Mar, 2022 13:58 IST|Sakshi

Russian-Saudi partnership:ఉక్రెయిన్‌ పై రష్యా సాగిస్తున్న దురాక్రమణకు అడ్డుకట్టే వేసే నేపథ్యంలో ప్రపంచదేశాలు పలు ఆర్థిక ఆంక్షలు విధించాయి. దీంతో రష్యన్‌ కరెన్సీ రూబుల్‌ రికార్డ స్థాయిలో పతనమైంది. మరోవైపు ముడి చమురు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్‌పుతిన్‌  సౌదీ యువరాజు క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్‌తో ఫోన్‌లో సంభాషించారు.

పాశ్చాత్య దేశాలు ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నందున కీలకమైన బౌగోళిక రాజకీయ కూటమి గురించి నొక్కిచెప్పారు. ఉక్రెయిన్‌ పై దాడి కారణంగా రష్యాను ఆర్థికంగా ఒంటరి చేశాయి. కీలకమైన రష్యా బ్యాంకులు అంతర్జాతీయ లావాదేవీల నిర్వహించకుండా ఉండేలా తొలగించింది. దీంతో వ్యాపారులు చమురు రవాణాను నిర్వహించడానికి విముఖత చూపుతారు.

ఈ మేరకు సౌదీ అరేబియా, రష్యా నేతృత్వంలోని ఓపెక్‌ ప్లస్‌ బుధవారం జరిగిన సమావేశంలో తీవ్రతరం అవుతున్న ఈ సంక్షోభాన్ని తాము పెద్దగా పట్టించుకోలేదని పుతిన్‌ అన్నారు.  కార్టెల్ క్రూడ్ ధరలను తగ్గించడానికి ఉత్పత్తిని పెంచే దిశగా కాస్త​ ఒత్తిడి ఎక్కువగా ఉందని ఇది మాస్కో, రియాద్‌ల మధ్య ఉద్రిక్తతలను సృష్టించే అవకాశం ఉందన్నారు . అయినా ప్రపంచ ఇంధన సరఫరా సమస్యలను రాజకీయం చేయడం ఆమోదయోగ్యం కాదని కూడా పుతిన్ నొక్కిచెప్పారు. రష్యా సౌదీ భాగస్వామ్యంలో ఇరు దేశాలు పరస్పర సహకారంతో సమగ్ర అభివృద్ధిపథంలోకి దూసుకుపోవాలని తాము ఆకాంక్షిస్తున్నట్లు వెల్లడించారు.

(చదవండి: అదే గనుక పేలితే ఐరోపా అంతమే: జెలెన్‌ స్కీ)

మరిన్ని వార్తలు