మహిళ బాత్‌రూమ్‌లో భారీ పైథాన్‌.. ఆ తర్వాత ఏమైందంటే?

10 Sep, 2022 16:54 IST|Sakshi

అనుకోకుండా ఓ పామును చూస్తేనే మనం భయంతో వణికిపోతాము. అలాంటిది ఇంట్లో ఉండే బాత్‌రూమ్‌లోకి ఏకంగా భారీ కొండ చిలువ ప్రవేశిస్తే.. ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇలాంటి షాకింగ్‌ ఘటనే థాయ్‌లాండ్‌కు ఓ మహిళకు ఎదురైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

వివరాల ప్రకారం.. బ్యాంకాక్‌కు చెందిన ఓ మహిళ ఇంట్లో ఉన్న బాత్‌రూమ్‌లోకి ఓ 12 అడుగుల కొండ చిలువ వెళ్లింది. ఈ క్రమంలో బాత్‌రూమ్‌లో నుంచి బయటకు వచ్చేందుకు కొండ చిలువ ప్రయత్నించింది. అయితే బాత్‌రూమ్‌ మొత్తం గ్లాస్‌తో కవర్‌ చేసి ఉండటంతో బయటకు రాలేకపోయింది. ఇదంతా అక్కడే ఉన్న రెండు పిల్లలు గమినిస్తూ ఉండటం వీడియోలో చూడవచ్చు. 

కాగా, ఇంటి సభ్యుల ఫిర్యాదుతో అక్కడికి వచ్చిన యానిమ‌ల్ కంట్రోల్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఇద్ద‌రు వ్య‌క్తులు పామును కాపాడి త‌మ‌తో తీసుకువెళ్లారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ టాయిలెట్‌ టబ్‌ నుంచి నీరు బయటకు వెళ్లే మార్గం ద్వారా కొండచిలువ బాత్‌రూమ్‌లోని వచ్చినట్టు తెలిపారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

A post shared by NowThis (@nowthisnews)

మరిన్ని వార్తలు