బ్రిటన్ రాణి అంత్యక్రియలు పూర్తి.. ప్రపంచ దేశాల అధినేతలు హాజరు

19 Sep, 2022 23:42 IST|Sakshi

లండన్‌: బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 అంతిమయాత్రను అధికారిక లాంఛనాలతో సంప్రదాయబద్దంగా నిర్వహించారు. రాణి భౌతికకాయం ఉన్న  వెస్ట్‌మినిస్టర్ అబెలో కుటుంబసభ్యులు సోమవారం తుది ప్రార్థనలు చేశారు. అనంతరం భారీ జన సందోహం మధ్య ఆమె శవపేటికను విండ్‌సోర్ కాస్టిల్‌కు తరలించారు. ‍అక్కడే ఖననం చేశారు.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సహా ప్రపంచ దేశాల అధినేతలు కలిపి మొత్తం 2000 మంది విదేశీ ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. భారత్ తరఫున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. లండన్‌లోని 125 థియేటర్లరో రాణి అంత్యక్రియలను లైవ్ ప్రదర్శన చేశారు.

బ్రిటన్ చరిత్రలో అత్యధిక కాలం రాణిగా ఉన్న 96 ఏళ్ల ఎలిజబెత్ 2 సెప్టెంబర్ 8న స్కాట్లాండ్‌లోని బల్మోరల్ కోటలో కన్నుమూశారు. దీంతో రాజకుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రపంచ దేశాలు రాణి మృతి పట్ల సంతాపం తెలిపాయి. రాణి వారసుడిగా ఆమె కుమారుడు కింగ్ చార్లెస్-3 బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.
చదవండి: రాణి చనిపోయింది కాబట్టి మా వజ్రాలు మాకిచ్చేయండి!

మరిన్ని వార్తలు