తొలిసారి అలా కనిపించిన బ్రిటన్‌ రాణి.. షాక్‌లో ప్రజలు

12 Oct, 2021 20:25 IST|Sakshi

లండన్‌: బ్రిటన్‌ మహారాణి ఎలిజబెత్‌-2కు సంబంధించిన ప్రతి విషయం తెలుసుకోవాలనే ఆసక్తి యూకే ప్రజలకే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వారందరికి ఉంటుంది. మరి ఆమే ఏం పడుచు పిల్ల కూడా కాదు. బ్రిటన్‌ రాణి వయసు ప్రస్తుతం 95 సంవత్సరాలు. ఈ ఏజ్‌లోనూ రాణివారు ఎంతో ఆరోగ్యంగా, అందంగా కనిపిస్తుంటారు. బహుశా ఈ విషయమే ప్రజలకు ఆసక్తి రేకెత్తిస్తుంటుంది. 
చదవండి: బ్రిటన్‌ మహారాణి కన్నుమూస్తే...!

సాధారణంగా ఇప్పటివరకు ఎలిజబెత్‌ రాణి బయట ఎక్కడ కనిపించినా ఎవరి సాయం లేకుండా స్వతహాగా నడుస్తూ ఉంటారు. అయితే తొలిసారి ఎలిజబెత్‌ తన చేతిలో కర్ర పట్టుకొని బయటకు వచ్చారు. మంగళవారం లండన్‌లోని వెస్ట్‌ మినిస్టర్‌ అబ్బేలో చర్చిలో సమావేశానికి హాజరైన ఎలిజబెత్‌ కర్ర సాయంతో నడుస్తూ ఇలా కెమెరా కంటికి చిక్కారు.ఘీ 95 ఏళ్ల చక్రవర్తి ఆమె కుమార్తె ప్రిన్సెస్ అన్నేతో కలిసి నల్ల కర్ర పట్టుకుని కారు నుంచి బయటకు దిగారు.
చదవండి: ప్రిన్స్‌ ఫిలిప్‌ కన్నుమూత

దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి. అయితే బ్రటిన్‌ రాణి కర్ర పట్టుకొని నడవడం చాలా అరుదు కావడంతో నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. ఆమె అనారోగ్యానికి గురయ్యారేమోనని సందేహం వ్యక్తం చేస్తున్నారు. కాగా 2004లో మోకాలి ఆపరేషన్ చేయించుకున్న తర్వాత చివరిసారిగా ఆమె కర్రను పట్టుకొని కనిపించారు. అయితే ప్రస్తుతం ఎలిజబెత్‌ ఇలా ఎందుకు కర్రను ఉపయోగించాల్సి వచ్చిందో ఆమె కార్యాలయం కారణం వెల్లడించలేదు. 
 

మరిన్ని వార్తలు