Queen Elizabeth's Death: బ్రిటన్‌ రాణి మరణంతో... వజ్రాలను తిరిగి ఇచ్చేయాలంటూ డిమాండ్‌

19 Sep, 2022 13:56 IST|Sakshi

బ్రిటన్‌ రాణి క్వీన్‌ ఎలిజబెత్‌ మృతి తర్వాత బ్రిటన్‌ రాజ కుంటుంబం అధీనంలో ఉన్న వజ్రాలను తమ దేశాలకు ఇచ్చేయాలంటూ సోషల్‌ మీడియా వేదికగా ప్రచారం ప్రారంభమైంది. బ్రిటన్‌ రాణి కిరీటంలో అనేక వజ్రాలు పొదగబడి ఉంటాయి. అవన్ని బ్రిటీష్‌ పాలిత దేశాల నుంచి దురాక్రమణంగా తెచ్చిన వజ్రాలే. ఐతే ప్రస్తుతం రాణీ మరణించింది కాబట్టి 'మా వ్రజాలు మాకిచ్చేయండి' అంటూ పలు దేశాలు డిమాండ్‌ చేయడం మొదలు పెట్టాయి.

ఆయ దేశాల సరసన దక్షిణాఫ్రికా కూడా చేరింది. ఆప్రికాలో ప్రసిద్ధిగాంచిని కల్లినన్‌ I అనే వజ్రాన్ని వలస పాలకులు బ్రిటీష్‌ రాజకుటుంబానికి అప్పగించాయి. ఆ వజ్రం ప్రస్తుతం రాణి రాజదండంపై అమర్చబడి ఉంది. ఈ మేరకు దక్షిణాఫ్రికా తమ దేశ ఖనిజాలతోనూ, ప్రజల సొమ్ముతోనూ బ్రిటన్‌ లబ్ధి చేకూర్చుకుందంటూ ఎత్తిపొడుస్తూ...తమ దేశ వజ్రాన్ని ఇచ్చేయమంటూ డిమాండ్‌ చేసింది.

అంతేకాదు వజ్రాన్ని తిరిగి ఇచ్చేయాలంటూ ఆన్‌లైన్‌లో.. change.org అనే వెబ్‌సైట్‌లో పిటిషన్‌ కూడా వేసింది. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా పార్లమెంటు సభ్యుడు వుయోల్వేతు జుంగులా బ్రిటన్‌ చేసిన నిర్వాకానికి పరిహారం ఇవ్వాల్సిందేనని, పైగా దొంగలించిన మొత్తం సొత్తును కూడా ఇచ్చేయాలంటూ డిమాండ్‌  చేస్తూ ట్వీట్‌ చేశారు.

ఆ వజ్రం ఒక బిందువు ఆకారంలో ఉంటుందని, 1600 ఏళ్ల నాటి పట్టాభిషేక వేడుకలో రాజ దండంలోని క్రాస్‌ గుర్తులో పొదగబడి ఉందని దక్షిణాఫ్రికా పేర్కొంది. ఈ వజ్రం అత్యంత విలువైనదే కాకుండా చారిత్రత్మకంగా చాలా ప్రసిద్ధి చెందినదని చెబుతోంది. దీన్ని లండన్‌ టవర్‌లోని జ్యువెల్‌ హౌస్‌లో బహిరంగ ప్రదర్శనలో ఉంచినట్లు పేర్కొంది.

(చదవండి: వెస్ట్‌మినిస్టర్‌ హాల్‌: రాణి శవపేటికను అక్కడే ఎందుకు ఉంచారంటే..)

మరిన్ని వార్తలు