Viral Video: బీచ్‌లో వింత కళేబరం వైరల్‌! ఎట్టకేలకు వీడిన మిస్టరీ

31 Mar, 2022 08:13 IST|Sakshi

సోషల్‌ మీడియాలో సొల్లు కబుర్లు చెప్పే బ్లాగర్స్‌ కొందరు ఈమధ్య కాలంలో ఎక్కువైపోయారు. ఫాలోవర్స్‌ను పెంచుకోవాలనే ఉద్దేశంతో అడ్డమైన విషయాలపైనా చర్చలు తీస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఓ యంగ్‌ బ్లాగర్‌ ఆస్ట్రేలియా సముద్ర తీరం ఒడ్డున పడి ఉన్న ఓ కళేబరాన్ని చూపిస్తూ వీడియో తీశాడు. దీంతో అది ఏలియన్‌ కళేబరం అంటూ పెద్ద దుమారమే చెలరేగింది. 

క్వీన్స్‌లాండ్‌లో సన్‌షైన్‌ తీర ప్రాంతం కాటన్‌ ట్రీ బీచ్‌ ఒడ్డులో వింత జీవి.. అంటూ అలెక్స్ టాన్ అనే పర్యాటకుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతకు ముందు తాను ఏనాడూ ఇలాంటీ జీవిని చూడలేదని, కనీసం దాని పేరు కూడా వినలేదని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. పలు సందేహాలు వ్యక్తం చేస్తూనే..  ఆ జీవి ఏంటో మీరైనా చెప్పాలంటూ ఫాలోవర్స్‌ను కోరగా..  ఆ వీడియో కాస్తా వైరల్‌ అయ్యింది. 

A post shared by ALEX TAN (@tanalex)

బహుశా గ్రహాంతరవాసి(ఏలియన్‌) అయి ఉండొచ్చా? అనే సందేహాన్ని సైతం వ్యక్తం చేశాడు ఆ వీడియోలో అలెక్స్.  దీంతో చాలా మంది ఫాలోవర్స్‌.. అతని వాదనతోనే ఏకీభవించడం మొదలుపెట్టారు. అలా.. బీచ్‌లో వింత జీవి, ఏలియన్‌ మృతదేహం అంటూ థంబ్‌ నెయిల్స్‌ కథనాలు వైరల్‌ అయ్యాయి. ఈ నేపథ్యంలో.. 

క్వీన్స్‌లాండ్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ స్టీఫెన్‌ జాన్‌స్టన్‌ ఆ తిక్క కథనాలను కొట్టిపారేశారు. దాన్కొక ‘పోసమ్‌’ (Possum)గా తేల్చారు. వరదలతో బహుశా అది అక్కడికి కొట్టుకొని వచ్చి ఉంటుందని చెబుతున్నారాయన. పోసమ్‌లు శాకాహారి జీవులు. పువ్వులు, పండ్లు, ఆకులు తింటాయి. ఆస్ట్రేలియా తీర ప్రాంతాలతో పాటు న్యూజిలాండ్‌లోనూ కనిపిస్తాయి. ముఖ్యంగా సిడ్నీలో చెట్లపై జీవిస్తూ.. మనుషులతో మమేకం అవుతుంటాయి ఇవి. ఒక్కోసారి సముద్ర తీరాలకు వెళ్తూ.. ప్రమాదం బారిన పడుతుంటాయి కూడా.

A post shared by Whitecliffs Foreshore Reserve (@whitecliffsforeshorereserve)

మరిన్ని వార్తలు