అమ్మకానికి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ నివసించిన గృహం

21 Sep, 2021 13:14 IST|Sakshi
అమ్మకానికి వచ్చిన రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ లండన్‌ నివాసం

లండన్‌: నోబెల్‌ అవార్డు గ్రహీత రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ లండన్‌లో కొంత కాలం పాటు నివసించిన గృహం తాజాగా అమ్మకానికి వచ్చింది. 1912లో ఠాగూర్‌గీతాంజలిని ఇంగ్లిష్‌లోకి తర్జుమా చేశారు. ఆ సమయంలో హాంపస్టెడ్‌ హీత్‌లోని హీత్‌ విల్లాలో నివసించారు. అప్పటి నుంచి ఈ విల్లాకు ప్రాముఖ్యత పెరిగింది. 2015, 17లలో బెంగాల్‌ సీఎం మమత యూకేను సందర్శించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆ విల్లాను కొనుగోలు చేసేందుకు ఆసక్తి వ్యక్తం చేశారు. లండన్‌లోని భారత హై కమిషన్‌తో ఆమె అప్పట్లో ఈ విషయంపై మాట్లాడారు.

ఠాగూర్‌ నివసించిన ఆ ఇంటిని ఓ మ్యూజియంగా మార్చాలని ఆమె అభిలషించారు. ఎస్టేట్‌ ఏజెంట్‌ ఫిలిప్‌ గ్రీన్‌ మాట్లాడుతూ.. తమ కస్టమర్లు అత్యధిక విలువను పొందడమే లక్ష్యమని, బ్రిటిష్‌ చట్టాలను అనుగుణంగా కొనుగోలు చేస్తే తమకు సమస్యేమీ లేదని కూడా చెప్పారు. అయితే ప్రస్తుతం ఈ విల్లా కొనుగోలుపై బెంగాల్‌ ప్రభుత్వంగానీ, కేంద్రంగానీ ఎలాంటి ఆసక్తి వ్యక్తం చేయలేదని లండన్‌లో భారత హైకమిషన్‌ తెలిపింది.
 

మరిన్ని వార్తలు