అత్యద్భుతమైన ప్రపంచ రికార్డు...చూస్తే వెన్నులో వణుకుపుడుతుంది!

7 Apr, 2022 09:30 IST|Sakshi

 సాహసోపేతమైన ప్రపంచ రికార్డులు చూస్తే.. అవి నిపుణుల పర్యవేక్షణలో సాధన చేస్తే సాధ్యమనిపిస్తుంది. మరికొన్ని ఫీట్‌లు సాధ్యమేనా ? అనే సందేహన్ని కలిగిస్తాయి. చాలా వరకూ ఆయా వ్యక్తుల అభిరుచి, ఒక విభిన్నమైన వ్యక్తిగా నిలవాలనే తపన వంటి లక్ష్యాలతోనే ఇలాంటి ప్రపంచ రికార్డులను నెలకొల్పగలరేమో !. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి సాధించిన ప్రపంచ రికార్డును చూస్తే చేయగలమా? అని సందేహం కచ్చితంగా వస్తుంది. ప్రయత్నించాలన్నా భయంగానే ఉంటుంది. ఎందుకంటే అది అత్యంత భయంకరమైన సాహసోపేతమైన ప్రపంచ రికార్డు.

వివరాల్లోకెళ్తే...బ్రెజిల్‌కి చెందిన రాఫెల్ జుగ్నో బ్రిడి అనే వ్యక్తి రెండు పారాచూట్‌ల మధ్య కట్టిన తాడుపై నడిచాడు. తాడు వెడల్పు కేవలం 25 సెం.మీ. అంతేకాదు అతను సుమారు ఒక వెయ్యి మీటర్లు(6,236 అడుగుల) ఎత్తులో తాడు పై నడిచాడు. అంటే బుర్జ్‌ ఖలీప్‌ కంటే రెంట్టింపు ఎత్తులో గాల్లో రెండూ పారాచూట్‌ల మధ్య కట్టిన తాడుపై నడిచాడు.

ఈ ఘటన బ్రెజిల్‌లోని శాంటా కాటరినాలోని ప్రియా గ్రాండేలో చోటుచేసుకుంది. నిజానికి ఆఫీట్‌ చూస్తే భయాందోళనతో పాటు ఆశ్చర్యమూ కలుగుతుంది.  ఈ మేరకు ఈ రికార్డుకు సంబంధించిన ఫీట్‌ని గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ రికార్డు ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో ఆన్‌లైన్‌లో తెగ వైరల్‌ అవుతోంది. దీంతో నెటిజన్లు ఈ ఫీట్‌ చూస్తే కాళ్లల్లో వణుకు కుపుడుతోందని ఒకరు,  ఇది ప్రపంచం గుర్తించదగ్గ రికార్డు అంటూ బ్రిడిని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు.

(చదవండి:  ఓరిని తెలివి.. పరీక్షల్లో ఇలా కూడా కాపీ కొడతారా.. అయినా దొరికిపాయే!)

మరిన్ని వార్తలు